పుంగనూరు ఎంపీడీవోగా రామనాథరెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మండల పరిషత్‌ అధికారిగా గ్రూపు-1లో ఎంపికైన రామనాథరెడ్డిని ప్రభుత్వం నియమించింది. మంగళవారం ఆయన పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ నరసింహప్రసాద్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, సిబ్బందితో సమావేశమై, వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ల సంఘ అధ్యక్షుడు సురేంద్రరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకుడు రాజశేఖరె డ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags: Ramanatha Reddy as Punganur MPDO

Leave A Reply

Your email address will not be published.