రామేశ్వరం దేవాలయంలో దొంగల బీభత్సం..

-హుండీల ధ్వంసం చేసి డబ్బులు ఎత్తుకెలిన దుండగులు
-శివరాత్రి జాతర నుంచి ఇంకా తెరవని హుండీ
-సుమారు 2,3 లక్షల వరకు పోయిఉండొచ్చని అంచనా

 

Date:20/05/2019

రంగారెడ్డి  ముచ్చట్లు:

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని దేవాలయం శ్రీ రామలింగేశ్వర దేవాలయం.. ఫరుఖ్ నగర్ మండలం లోని రామేశ్వరం దేవాలయంలో దొంగల ముఠా ప్రవేశించి అర్ధరాత్రి కొన్ని హుండీలను ధ్వంసం చేసి పెద్ద ఎత్తున హుండీలో డబ్బులను దోచుకెళ్లారు ఆలయ ఈఓ శాంసుందరా చారి  మాట్లాడుతూ సోమవారం తెల్లవారు జామున సుమారు 2 గంటల  సమయంలో ఆలయంలో దొంగలు పడి ఉండిలను ద్వంసం చేసి డబ్బులను ఎతికేళినట్లు తెలిపారు. శివరాత్రి జాతర జరిగినప్పటి నుండి ఉండి తెరువలేదని సుమారుగా 2 నుంచి 3 లక్షల వరకు పోయివుంటాయనితెలిపాడు.సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి  చేరుకొని  దొంగతనానికి పాల్పడ్డ తీరు పట్ల పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇది స్థానిక దొంగల పనా లేక అంతరాష్ట్ర దొంగల పనా అన్న కోణాల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆలయం లో ఏర్పాటు చేసిన సిసి ఫుటేజీలను పరిశీలిస్తున్నారు ఇటీవల   శివరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులు అనేక విలువైన కానుకలు,నగదును హుండీలో స్వామి వారికి సమరిపించినట్టు గ్రామస్తులు తెలిపారు.

 

లోకసభ స్పీకర్ పై చర్చలు

 

Tags: Rameshwaram Temple

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *