రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కు ఐఎన్ఎస్ డేగ లో ఘన స్వాగతం

విశాఖపట్నం ముచ్చట్లు:
 
ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ సందర్భంగా రాష్ట్రానికి చేరుకున్న భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కు ఘన స్వాగతం పలికారు. ఆదివారం విశాఖపట్నంలో నేవీ విమానాశ్రయం ఐఎన్ఎస్ డేగ కు సాయంత్రం గంటలు 5.35 నిమిషాలకు ఆయన చేరుకున్నారు. స్వాగతం పలికిన వారిలో రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్, రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం, జిల్లా ఇన్చార్జి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు(అవంతి), నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, జడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర, ప్రభుత్వ విప్ బూడి ముత్యాల నాయుడు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ మల్లికార్జున, AVSM, YSM, VSM, ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్ చీఫ్, తూర్పు నౌకాదళ కమాండ్, విశాఖపట్నం, వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్‌గుప్తా,
రాజ్యసభ సభ్యులు, ప్రభుత్వ ప్రతినిధి వి. విజయ సాయి రెడ్డి, పార్లమెంటు సభ్యులు ఎంవివి సత్యనారాయణ, గొడ్డేటి మాధవి, బివి సత్యవతి
శాసన సభ్యులు పిజివిఆర్ నాయుడు (గణబాబు), పాఠశాల విద్య శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, బి రాజశేఖర్, అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా & ఆర్డర్)ఎ. రవిశంకర్, రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటి కృష్ణ బాబు,” డిఐజి రంగారావు, నగర పోలీసు కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా, జిల్లా ఎస్పీ బి కృష్ణరావు, ప్రొటోకాల్ & డిప్యూటి సెక్రటరీ ఎం. బాలసుబ్రహ్మణ్యం రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్లు ఎం వేణుగోపాల్ రెడ్డి, పి. అరుణ్ బాబు, విఎంఆర్డిఎ కమీషనర్ వెంకట రమణారెడ్డి, పాడేరు సబ్ కలెక్టర్ అభిషేక్, తదితరులు పాల్గొన్నారు.
 
 
Tags:swogatham

Natyam ad