Natyam ad

రామోజీరావు చట్టానికి అతీతుడు కాడు

విజయవాడ ముచ్చట్లు:


మార్గదర్శి చిట్ ఫండ్ వ్యవహారంపై జలవనరుల మంత్రి అంబటి రాంబాబు మాట్లాడారు. మంత్రి మాట్టలాతూ ఇప్పటంలో చిన్న విషయం మీద గగ్గోలు పెట్టారు. పవన్ కల్యాణ్ అయితే, ప్రభుత్వాన్ని కూల్చేయాలన్నారు.  చట్టబద్ధంగా ఎవరైనా చిట్ఫండ్ వ్యాపారం చేసుకోవచ్చు. కానీ, రామోజీ చట్టానికి వ్యతిరేకంగా చిట్ ఫండ్ వ్యాపారం చేస్తున్నారు. రామోజీ సంస్ధలన్నీ చట్ట వ్యతిరేకంగా ఏర్పాటయ్యాయి. మార్గదర్శి విచ్చలవిడిగా చట్టాల నిబంధనలు ఉల్లంఘించింది. ఎవరైనా చిట్ ఫండ్ నిబంధనలు పాటించాల్సిందే. చిట్ ఫండ్ కంపెనీలపై రాష్ట్ర వ్యాప్తంగా సోదాలు జరుగుతున్నాయి. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. మార్గదర్శి చట్టాన్ని ఉల్లంఘించి అనేక అక్రమాలకు పాల్పడుతోంది. చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నవారు ఎవరైనా, చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. రామోజీ సంస్థలన్నీ చట్టానికి వ్యతిరేకంగానే నిర్మితమయ్యాయని, ఒక్కొక్కటి తేటతెల్లమవుతున్నాయని అన్నారు. ప్రస్తుతం మార్గదర్శి కేసు సుప్రీం కోర్టులో ఉంది. రామోజీ రావు చట్టవ్యతిరేకంగా మార్గదర్శి నడుపుతున్నాడని అన్నారు.

 

 

 


మొన్న జరిగిన సోదాల్లో మోసాలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. చిట్స్ సొమ్మును ప్రత్యేక ఖాతాలో వేయాలి. ప్రతి చిట్కు ఒక ఖాతా ఉండాలని చట్టంలో ఉంది. మార్గదర్శిలోని అన్నింటికీ ఒకే ఖాతా ఉందని అన్నారు.
సోదాల్లో అధికారులు ఆ విషయాన్ని గుర్తించారు. చిట్ పాడుకున్నవారిని ష్యూరిటీల  పేరుతో  వేధించి, కొంతకాలం నగదును హోల్డ్ చేస్తున్నారు. ఎవరి ష్యూరిటీ తీసుకెళ్లిన రిజక్ట్ చేస్తున్నారు. అలా వేల కోట్లను వారికి సంబంధించిన వేరే కంపెనీల్లో పెట్టుబడులు పెడుతున్నారు. 50 ఏళ్ల నుంచి చట్ట వ్యతిరేకంగానే వ్యాపారం చేస్తున్నారు. రామోజీ వైట్ కాలర్ క్రిమినల్. రామోజీ ఆర్దిక నేరగాడు. మార్గదర్శి ఖాతాలను వేరే ఖాతాల్లో జమ చేయడం ఆర్దిక నేరం. ఫండ్స్ను ఇతర సంస్థలకు మళ్లించడం నేరం. రామోజీ రావు చట్టానికి అతీతుడు కాదు. మార్గదర్శిలో చిట్టీలు వేసేవారు ఆలోచించుకోవాలి. చిట్ ఫండ్ కంపెనీ వేరే వ్యాపారాలు చేయకూడదు. పైసా పెట్టుబడి లేకుండా వేల కోట్ల సామ్రాజ్యం ఎలా ఏర్పాటు చేశాడో. రామోజీ రావు చెప్పాలి. మేం కక్ష సాధిస్తున్నామని అనడం సరికాదు. చట్టాలను ఉల్లంఘిస్తే ఎవరిమీదనైనా కేసులు పెడతాం. అక్రమంగా డిపాజిట్లు సేకరించమని కోర్టులో చెప్పి, ఇప్పటి కీ డిపాజిట్లే సేకరిస్తున్నారు. చట్టాలకు అతీతంగా ఎవరూ వ్యవహరించినా ప్రభుత్వం ఉపేక్షించదు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ఎవరైనా ఖండించాల్సిందేనని అయన అన్నారు.

 

Post Midle

Tags: Ramoji Rao is not above the law

Post Midle

Leave A Reply

Your email address will not be published.