ఏ అర్హతతో రామోజీకి అధికారికంగా సంస్మరణ సభ జరిపారు?

తిరుపతి ముచ్చట్లు:

 

ఏ అర్హత ఉందని ఈనాడు దిన పత్రిక అధినేత రామోజీ రావు సంస్మరణ సభను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి జరిపిందని వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నారపరెడ్డి రాజారెడ్డి ప్రశ్నించారు.
భారత మాజీ ప్రధాన మంత్రి పి వి నరసింహారావు చనిపోయినప్పడు కూడా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సంస్మరణ కార్యక్రమం నిర్వహించలేదని, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్ టీ రామారావు చనిపోయినప్పుడు కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉన్నా సంస్మరణ సభ నిర్వహించలేదని అన్నారు. రామారావును ముఖ్యమంత్రి పదవి నుండి దింపి చంద్రబాబు ను ముఖ్యమంత్రి చేసెందుకు రామోజీ ప్రముఖ పాత్ర వహించాడని 2024లో జగన్ మోహన్ రెడ్డి ని ముఖ్యమంత్రి పదవి నుండి దింపేందుకు ఈనాడు పేపర్ లో అనేక అబద్దాలు వండి వార్చి ప్రజలను ఏమార్చి ముఖ్యమంత్రి అయ్యేందుకు ప్రముఖ పాత్ర వాహించిన రామోజీ ఋణం తీర్చుకొనేందుకు చంద్రబాబు ప్రభుత్వ సొమ్మును విచ్చల విడిగా ఖర్చు పెట్టడం విడ్డురమని అన్నారు.

 

Tags:Ramoji’s official memorial service was held under which qualification?

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *