Natyam ad

కాంగ్రెస్ విజయ భేరీ కి తరిలి వెళిన రాంపూర్ కాంగ్రెస్ నాయకులు..

నాగర్ కర్నూల్ ముచ్చట్లు:

అచ్చంపేట నియోజక వర్గంలో జరిగే కాంగ్రెస్ విజయ భేరీ భహిరంగ సభ కు రాంపూర్ గ్రామ కాంగ్రెస్ నాయకులు 200 మంది భారీ ఎత్తున తరలి వెళ్లారు. ఈసందర్భగా కాంగ్రెస్ పార్టీ నాయకులు సతీష్ మాట్లడుతూ రాబోయేది కాంగ్రెస్ అని రేవంత్ రెడ్డి ముఖ్య మంత్రి అవుతారని, గెలిచిన వెంటనే 6 గ్యారెంటీ లు అమలు చేస్తారని అన్నారు. తెరాస ప్రభుత్వం వారి అనుచరుల కు మాత్రమే బీ సీ బందు, దక్కినయని అన్నారు. కాంగ్రెస్ గ్యారంటీ లు మహాలక్ష్మి మహిళలకు ప్రతి నెల 2500, సిలిండర్ 500 కే, అర్ టీ సి బస్ లో ఉచిత ప్రయాణం, రైతు భరోసా ఏకరానికి 15 వేలు,వవసాయ కూలీలకు 12 వేలు, వరి పంట కు బోనస్ 500, గృహ జ్యోతి ప్రతి కుటుంబానికి 200 యూనిట్స్ ఉచిత విద్యుత్, ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు ఇంటి స్థలం మరియూ 5 లక్షలు, యు వ వికాసం విద్యార్థులకు 5 లక్షల విద్య భరోసా కార్డు ,

 

 

ప్రతి మండలం లో తెలంగాణా ఇంటర్ నేషనల్ స్కూల్, కుటుంబ పెద్ద లకు అవ్వ తాత లకు నెలవారి పెన్షన్ 4 వేలు, రాజీవ్ ఆరగ్యశ్రీ శ్రీ భీమా 10 లక్షలు. అమలు చేస్తారని ఆయన అన్నారు. అందుకు అచ్చంపేట ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ హస్థం గుర్తు కు ఓటు వేసి భారీ మెజార్టీ తో గెలిపించాలని కోరారు. సభకు తరలి వెళ్లిన వారిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప్ప సర్పంచ్ మేడారం శ్రీకాంత్, నరేష్ మర్క కురుమయ, భాస్కర్ చారి, బాలస్వామి, యాదగిరి, వెంకటయ్య. పెద్ద చంద్రయ్య, చెన్నయ్,హన్మంతు, రాకేశ్, జంగయ, వెంకటమ్మ, కవిత, మసమ్మా, సుజాత,నిరంజన్, మహేష్, కోడెల మల్లయ్య, రములు, రామచంద్ర, కసీం, వసంత, భారతమ్మ, కోడెల వెంకయ్య. తదితరులు తరలి వెళ్లారు.

 

Post Midle

Tags: Rampur Congress leaders who went to Congress Vijaya Bheri..

Post Midle