శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న  డ్రైవర్ రాముడు

Ramu is the driver who is shooting fast

Ramu is the driver who is shooting fast

 Date:16/07/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
కమెడియన్ గానే కాకుండా హీరో గా కూడా దూసుకుపోతున్న మన  నవ్వుల వీరుడు షకలక శంకర్. తాను హీరో గా నటించిన శంభో శంకర చిత్రం ఘనవిజయం సాధించింది. ఇప్పుడు అంతే ఉత్సాహంగా మన నవ్వుల వీరుడు షకలక శంకర్ డ్రైవర్ రాముడు సినిమా ని శరవేగం గా పూర్తిచేస్తున్నాడు. ప్రస్తుతానికి  ఐటమ్ సాంగ్ చిత్రీకరణ జరుగుతుంది.  ఇప్పటికే విడుదల అయినా పోస్టర్, మొదటి టీజర్ కు మంచి స్పందన వచ్చింది. షకలక శంకర్ హీరో గా నటించిన రెండో సినిమా పై అంచనాలు పెరిగాయి.
ఈ సందర్భంగా దర్శకుడు రాజ్ సత్య మాట్లాడుతూ… మా సినిమా డ్రైవర్ రాముడు చిత్రీకరణ  దాదాపు పూర్తియింది. ప్రస్తుతానికి  భారీ సెట్ లో ఐటమ్ సాంగ్ చిత్రీకరిస్తున్నాం. శివశంకర్ మాస్టరు ఈ పాటని చిత్రీకరిస్తున్నారు.  షకలక శంకర్ గారు సినిమా అవుట్ ఫుట్ చూసి చాల హ్యాపీ గా ఉన్నారు. మా నిర్మాతలు K. వేణు గోపాల్  , ఎమ్ ఎల్ రాజు, టీ . కీరత్  బాగా ఖర్చు పెడుతున్నారు. సినిమా చాల బాగావస్తుంది. త్వరలోనే విడుదల చేస్తాం.   నిర్మాతలు మాట్లాడుతూ “మా డ్రైవర్ రాముడు సినిమా ఊహించిన దానికంటే చాల బాగావచ్చింది. మా దర్శకుడు రాజ్ సత్య భారీ సినిమా లాగా చిత్రీకరిస్తున్నారు. సంగీత దర్శకుడు సునీల్ కశ్యాప్ ఇచ్చిన సంగీతం ఈ చిత్రానికి హైలైట్. ప్రస్తుతానికి  భారీ సెట్ లో యువతని ఉరుతలూగించే ఐటమ్ సాంగ్ చిత్రీకరణ జరుగుతుంది  త్వరలోనే సినిమా విడుదలకు అని కార్యక్రమాలు పూర్తి చేస్తాము” అని తెలిపారు. ఈ చిత్రంలో శంకర్, అంచల్ సింగ్, ప్రదీప్ రావత్, నజర్ , తాగుబోతు రమేశ్, ధన్ రాజ్, మహేష్ విట్టా నటిస్తున్నారు.
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న  డ్రైవర్ రాముడు https://www.telugumuchatlu.com/ramu-is-the-driver-who-is-shooting-fast/
Tags:Ramu is the driver who is shooting fast

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *