రాముడు, రామనారాయణుడు ఒక్కరే…

Date:15/03/2018
ఖమ్మం ముచ్చట్లు:
భద్రాచలంలో సీతారాముల గోత్రవ్రతాలు మారాయని, రామచంద్ర స్వామినే వరాయ అనడానికి బదులు రామనారాయణ స్వామినే వరాయా అంటున్నారని కొంతమంది పనిగట్టుకొని రాద్ధాంతం చేయడం తగదనే అభిప్రాయాలు యావత్ పండిత, అర్చక లోకం వ్యక్తం చేస్తోంది. రహస్యాలను, రహస్యంగానే ఉంచాలి. నిజంగానే ఒకవేళ ఎక్కడైనా చిన్నచిన్న పొరపాటు ఉచ్ఛరాణలు వచ్చినట్టయితే లేదా ఆగమ సంప్రదాయ పద్ధతులను పాటించడంలేదని అనుకుంటే వాటిని సవరించుకోవచ్చు. ఆ సవరణ లేదా సర్దుబాటు ప్రక్రియ అంతా పీఠాధిపతులు, మఠాధిపతులు, పూజాగ్రేసరులు కూర్చొని చర్చించుకొని లోటుపాట్లను సర్దుకోవాలే తప్ప భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా రచ్చచేయడం తగదని పండితులు సూచిస్తున్నారు. శతాబ్దాలుగా, దశాబ్దాలుగా లేని కొత్త విధాలను తామేదో భగవంతుడికన్నా ఎక్కువైనట్టు సృష్టించడం తగదనే సూచన చేస్తోన్నారు. ఇటువంటి వివాదాలను సృష్టించడం ద్వారా, భక్తుల్లో, ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించడం వెనుక ఉన్న ఆంతర్యాన్ని, అంతఃస్సూత్ర నేపథ్యాన్ని లోతుగా పరిశీలించి, పర్యవసానాలను అవగతం చేసుకొని నివారణ చర్యలు తక్షణమే చేపట్టాల్సి ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. భద్రాద్రి రాద్ధాంతం వెనుక బలమైన ప్రేరేపిత, ప్రతీపశక్తులున్నాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం స్వరాష్ట్రం సాధించిన తర్వాత ఆలయాల పునరుద్ధరణ, పునర్వికా సం కోసం అనేక ప్రయత్నాలు చేపడుతోంది. యా దాద్రి నిర్మాణం శరవేగంగా సాగుతోంది. వేములవాడ రాజరాజేశ్వరీ ఆలయానానికి దాదాపు రూ. 100 కోట్లు కేటాయించి అభివృద్ధి చేస్తోన్నారు. త్వరలో భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి నవాలయ నిర్మాణానికి ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ నడుం కట్టారు. తెలంగాణలోని పెద్ద పెద్ద క్షేత్రాలకే కాకుండా చిన్న చిన్న ఆలయాలకూ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. మేడారం సమ్మక్క-సారక్క వంటి ఆదివాసీ గిరిజన దైవాలకు ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చే విధంగా ఇటీవలే జాతర సందర్భంగా సీఎం కేసీఆర్ రూ.200 కోట్లు కేటాయించి అభివృద్ధి చేయడమే కాకుండా రెండు నుంచి మూడు వందల ఎకరాల స్థలాన్ని కేటాయించి శాశ్వత ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు. ఆ ప్రక్రియ కొనసాగుతోంది. భద్రకాళీ అమ్మవారికి రెండు కిలోల బంగారు కిరీటం, ఆభరణాలు, కురవి వీరభద్రుడికి బంగారు కోర మీసాలు ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ వ్యాప్తంగా ప్రభు త్వం దాదాపు అన్ని దేవాయలకు ఆయా ప్రాంతాల్లోని స్థల ప్రాముఖ్యత, భక్తుల సంఖ్యను బట్టీ ప్రాధాన్యతాక్రమంలో ఏర్పాట్లు చేస్తోంది. వీటి ఫలితంగా తెలంగాణ వ్యాప్తంగా ఆలయాల్లో భక్తుల తాకిడి రోజురోజుకూ పెరుగుతోంది. గతంలో లాగా తెలంగాణేతర ప్రాంతాల ఆలయాలకు గతంతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం నుంచి భక్తుల సంఖ్య తగ్గడమే కాకుండా ఆయా ప్రాంతాల్లోని ఆలయాల ప్రచారం, ప్రభ తగ్గుతూ రావడంతో ఇలాంటి విపరణామాలు చోటుచేసుకుంటున్నాయని, అందులో భాగంగానే భద్రాదిలో సామరస్య భక్తి వాతావరణాన్ని చెడగొడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. శతాబ్దాల చరిత్ర ఉన్న భద్రాద్రి దేవస్థానంలో ఇప్పటి వరకు బైఠాయించి నిరసన తెలిపిన ధాఖలాలు లేవని పండితులు పేర్కొంటున్నారు. అమరావతి శైవ క్షేత్ర పీఠాధిపతి శివస్వామి భద్రాద్రిలోని శ్రీ సీతారాచంద్రస్వామి అంతరాలయంలో బైఠాయించి నిరసన తెలపడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న భద్రాద్రిలో శివస్వామి చేసిన నిర్వాహకంపై యావత్ హిందూ ధర్మకర్తలు, ఉత్తరాధికారులు మండిపడుతున్నారు. ధర్మపరిరక్షణ, ఆచార, వ్యవహారాలను కాపాడుతూ ప్రపంచానికి శాంతి సందేశాన్ని కలిగించే దిశగా పీఠాధిపతులు హుందాగా వ్య వహరించాలనే సూచన చేస్తున్నారు. శివస్వామి తన శిష్య బృందంతో కలిసి సామాన్య భక్తుల్లా ఆలయంలోకి ప్రవేశించి భక్తుల మనోభావాలను దెబ్బ తీసేలా అంతరాలయంలో బైఠాయించి నినాదాలు చేయడంపై ఇటు శ్రీవైష్ణవ అటు శైవ సాంప్రదాయకుల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఏ క్షేత్రంలోనైనా ఆగమ శాస్త్రం ప్రకారం దైనందిన కార్యక్రమా లు జరుగుతాయి. ఆలయంలో జరుగుతున్న పూజ లు, కల్యాణ వేడుకలు ఇతరత్రా  ప్రమాణాలలో ధర్మ సందేహాలు వస్తే అక్కడున్న స్థా నాచార్యునితో రహస్యంగా చర్చించాల్సి ఉండేదని, అలా కాదని సనాతన ధర్మం మధ్య చిచ్చుపెట్టేలా శివస్వామి ప్రవర్తించడం ముమ్మాటికీ సహేతుకం కాదనే అభిప్రాయాలను పండితులు వ్యక్తం చేస్తున్నారు. శివ, కేశవులు ఒక్కటే అని చెప్పడానికి రా మేశ్వరంలో శ్రీరాముడు సైకత లింగాన్ని ప్రతిష్టించి అభిషేకం చేశారని వారు ఉదహరిస్తోన్నారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే అని రామనామ మహత్యాన్ని స్వయంగా శివుడే పార్వతికి తెలియజేసాడని పురాణాలు చెబుతున్నాయని పేర్కొంటున్నారు. శ్రీరామ కల్యాణ వేడుకలను స్మార్థులు తిథి ప్రకారం నిర్వహిస్తే శ్రీవైష్ణవులు పునర్వసు నక్షత్రం ప్రకారం నిర్వహిస్తారని, కల్యాణ వేడుకలను శైవులు, శ్రీవైష్ణవులు నిర్వహిస్తూ తమ ధర్మాన్ని కాపాడుతున్నారని చెబుతున్నారు. భద్రా ద్రి శ్రీ సీతారామచంద్రస్వామిని అర్చకులు రామనారాయణుడు అని ఉచ్ఛరిస్తారని, కానీ శివస్వామి తప్పుపట్టడం, ఆలయంలో వైధికులు, స్థానాచార్యుడు లేని సమయంలో వచ్చి అంతరాయలంలో బైఠాయించి నిరసన తెలుపడం సరికాదని ఆధాత్మికవేత్తలు పేర్కొంటున్నారు.
Tags: Ramu, Ramanarayana is one …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *