పుంగనూరులో భక్తిశ్రద్దలతో రంజాన్ వేడుకలు
పుంగ నూరు ముచ్చట్లు:
ముప్పె రోజులు కఠోర ఉపవాస దీక్షలు నిర్వహించిన ముస్లింలు శనివారం దీక్షలు విరమించి రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించారు. పుంగనూరు, మండలంలోని మసీదుల్లోను, ఈద్గాల వద్ద నమాజ్‌లు నిర్వహించారు. ఐకమత్యంతో అల్లాను ప్రార్థిస్తూ ఈద్గాలకు చేరుకున్నారు.ఈద్గాల వద్ద స్థలం చాలకపోవడంతో రహదారులపై కుర్చోని నమాజ్‌లు చేశారు.అలాగే స్మశానవాటికలకు వెళ్లి మృతి చెందిన కుటుంబ సభ్యుల సమాధుల వద్ద పూజలు చేశారు. పట్టణంలోని ఎన్‌ఎస్.పేట ఈద్గా వద్ద, ఎంఎం.మహమ్మదాలి ఈద్గా వద్ద, రాంపల్లె వద్ద, కుమ్మరవీధి వద్ద ముస్లింలు ప్రార్థన లు నిర్వహించారు. వేలాది మంది ముస్లింలు నూతన దుస్తులు ధరించి ప్రార్థనలు జరిపారు. ముస్లింలు ఖురాన్‌పఠనం చేసి నమాజ్‌లు చేశారు. మహిళలు వారివారి ఇండ్లలో ప్రార్థనలు జరిపారు. ఈద్గా వద్దకు ప్రదర్శనగా ముస్లింలు వెళ్తూ అల్లాహ్గ..అక్భర్ అంటు ప్రార్థనలు చేస్తూ మత పెద్దలు, ముతవల్లిలతో కలసి ఈద్గా వద్దకు చేరుకున్నారు. ఇండ్ల వద్ద పేదలకు నగదు, దుస్తులు, అన్నదానాలు నిర్వహించారు. హిందూముస్లింలందరు కలసి పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటు వింధు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా, వక్ఫ్ బోర్డు చైర్మన్ అమ్ము, సీమ జిల్లాల మైనార్టీ సెల్ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్, అంజుమన్ కమిటి అధ్యక్షుడు ఎంఎస్.సలీం, సున్ని అంజుమన్ కమిటి అధ్యక్షుడు ఇనాయతుల్లా షరీఫ్ ల ఆధ్వర్యంలో ముస్లింలు ప్రశాంతంగా రంజాన్ వేడుకలు నిర్వహించారు. సీఐ మధుసూదన్‌రెడ్డి, ఎస్‌ఐ మోహన్‌కుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

Tags: Ramzan celebrations with devotion in Punganur
