అటవీ భూమి ఆక్రమణపై అడిగినందుకు విలేకరిని దుర్భాషలాడిన రేంజర్‌

Ranger abuses reporter for asking for forest land invasion

Ranger abuses reporter for asking for forest land invasion

– భూములు రహస్యంగా సర్వే
– ఆక్రమణ భూమిని పరిశీలించని రేంజర్‌
– అటవీశాఖపై ఆరోపణలు

Date:24/08/2019

చౌడేపల్లె ముచ్చట్లు:

కోట్లాది రూపాయలు విలువ చేసే అటవీభూమిని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆక్రమించుకునే ప్రయత్నాలు చేశారు. ఈ విషయం సాక్షిలో శనివారం ప్రచురితమైంది. దీనిపై అధికారులు బహిర ంగ సర్వే చేపట్టాల్సి ఉండగా ఇందుకు భిన్నంగా అటవీశాఖ రేంజర్‌ ఆక్రమణ దారులతో కుమ్మకై తాను పరిశీలించకుండ సిబ్బందిచే తూ…తూ మంత్రంగా సర్వే చేపట్టి చేతులు దులుపుకుంటున్న వైనం వెలుగు చూసింది. ఈ విషయమై చౌడేపల్లె సాక్షి విలేకరిని ఫోన్‌లో దుర్భాషలాడి పత్రికలో వార్తను వేసినందుకు తన అక్కసును రేంజర్‌ వెల్లబోసుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి. చౌడేపల్లె మండలం చారాల సిఎల్‌డిపి సమీపంలోని అడ్డగుట్ట వద్ద అటవీశాఖకు చెందిన సుమారు 20 ఎకరాల భూములను తెలుగుదేశం నాయకులు ఆక్రమించుకున్నారు. ఈ విషయాలు సాక్షి ద్వారా వెలుగుచూసింది. దీనిపై అటవీశాఖ సిబ్బంది కరమ్‌సింగ్‌, దొరస్వామి కలసి విలేకరులకు కనీస సమాచారం కూడ ఇవ్వకుండ మ్యాప్‌లు పట్టుకుని సర్వే చేశారు. రేంజర్‌ గోవిందరాజన్‌ దురాక్రమణ ప్రాంతాన్ని సందర్శించక పోవడం , కనీసం తన బాధ్యతలను గుర్తించి రాకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. కోట్లాది రూపాయలు విలువ చేసే భూమిని కాపాడాల్సిన అటవీశాఖ అధికారి నిమ్మకు నీరేత్తినట్లు ప్రవర్తించడంతో ఆక్రమణదారులకు అడ్డుఅదుపులేకుండ పోతోంది. దీనిపై జిల్లా ఫారెస్ట్ అధికారి సునీల్‌కుమార్‌రెడ్డి వెంటనే చర్యలు తీసుకుని అటవీశాఖ భూమి అన్యాక్రాంతం కాకుండ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

విలేకరిపై దుర్భాషలు ….

దురాక్రమణ జరిగిన విషయాలను విచారించేందుకు శుక్రవారం సాక్షి విలేకరి ఫోన్‌లో రేంజర్‌ గోవిందరాజన్‌ను మూడు సార్లు సంప్రదించినా ఫలితం లేకపోయింది. అలాగే శనివారం సాయంత్రం 4:39 గంటలకు రేంజర్‌కు ఫోన్‌ చేయడంతో రేంజర్‌ పత్రికల్లో రాయలేని విధంగా విలేకరిని దుర్భాషలాడి , ఏం పీకుంటారు..రేంజర్‌ అంటే ఏమనుకుంటున్నావ్‌… నాకు 16 మండలాల ఇన్‌చార్జ్ నేను అంటు తన అహాంకారాన్ని ప్రదర్శించాడు. ఈ విషయాన్ని విలేకరులు ఖండించారు. ఈ విషయమై విలేకరులు ఆదివారం ఫారెస్ట్ కార్యాలయం వద్ద ధర్నా చేయనున్నట్లు సంఘ ప్రతినిధులు ముత్యాలు, మురళి ప్రకటించారు. ఈ మేరకు పుంగనూరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఐఏఎస్‌ అధికారిగా మునివెంకటప్ప సేవలు ప్రశంసనీయం

Tags: Ranger abuses reporter for asking for forest land invasion

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *