Natyam ad

ఇంటింటా రంగోలిని  విజయవంతం చేయాలి-జిల్లా కలెక్టర్ జి. రవి

జగిత్యాల  ముచ్చట్లు:

75 స్వాతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా శనివారం ఇంటింటా రంగోలి కార్యక్రమం నిర్వహించాలని  జిల్లా కలెక్టర్ జి. రవి ఒక ప్రకటనలో తెలిపారు.75 స్వాతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగాప్రతీ ఇంటి ముందు స్వాతంత్ర్యంకు సంబంధించిన  ముగ్గులు వేసేలా మహిళా గ్రామ సంఘాలు, మండల సమాఖ్యాలు, మండల అధికారులు ప్రోత్సహించి పోటీలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని మండల అధికారులను ఆదేశించారు. ఈ నెల 20 న జరిగే రంగోలి కార్యక్రమంలో మహిళలు, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కోరారు.

 

Post Midle

Tags: Rangoli at home should be successful-District Collector G. Ravi

Post Midle