కదిరిలో చిన్నారి పై అత్యాచారయత్నం

పరారీలో నిందితుడు

Date:14/12/2019

కదిరి ముచ్చట్లు:

అభం శుభం తెలియని చిన్నారి పై అత్యాచార ఘటన అనంతపురం జిల్లా కదిరిలో చోటుచేసుకుంది.కదిరి పట్టణంలోని వలిసాబ్ సాబ్ రోడ్డుకు చెందిన రెండవ తరగతి చదువుతున్న 8 సం ల చిన్నారిపై జగదీష్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడినట్లు చిన్నారి తల్లి పేర్కొంది. చిన్నారి తల్లి తెలిపిన వివరాల మేరకు రాయలసీమ సర్కిల్ లో ఒక భవనం లో మదరసా సగ భాగం, మరో సగ భాగం లో మణఃపురం గోల్డ్ ఫైనాన్స్ కార్యాలయం ఉంది. చిన్నారి ఉర్దూ ట్యూషన్ కు ఒక సంవత్సరం నుండి పంపుతునట్లు ఆమె తెలిపింది. రోజు వెళుతున్నట్లు ట్యూషన్ కు వెళ్ళింది. తే మనఃపురం గోల్డ్ ఫైనాన్స్ లో సెక్యురిటి గా పనిచేస్తున్నా ఖయ్యూం అనే వ్యక్తి ఇంట్లో పండుగ కారణంగా సెలవులో వున్నాడు. సెక్యురిటి గా పని చేసే మరో వ్యక్తి జగదీష్ కు చెప్పి ఖయ్యూం వెళ్ళిపోయాడు. ట్యూషన్ కు వచ్చిన చిన్నారి పై జగదీష్ అత్యాచారానికి పాల్పడ్డాడు. దాంతో చిన్నారి భయంతో  ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చేసింది. జరిగిన విషయం తల్లికి  తెలిపింది. మేము వెళ్లే సమయానికి జగదీష్ పారిపోయాడని తెలిపింది. ఈ విషయం పై కదిరి పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసుకొని జగదీష్ కోసం గాలిస్తున్నామని పట్టణ సిఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.

 

పడిపోతున్న ఉష్ణొగ్రతలు

 

Tags:Rape attempt on a child in Kadari

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *