త్రిపురలో దారుణం, అక్కచెల్లెళ్లపై రేప్

Date:17/11/2018
బెంగళూర్ ముచ్చట్లు:
తెలిసినవాడేనని ఆటో ఎక్కితే, మరో ఇద్దరితో కలిసి అక్కాచెల్లెళ్లను అపహరించి, వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన అలస్యంగా వెలుగుచూసింది. త్రిపురలోని ఉనాకోటి జిల్లాలో నవంబరు 9 న చోటుచేసుకున్న ఈ ఘటనలో ఓ నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. త్రిపుర రాజధాని అగర్తలాకు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న కైలాశహర్ పట్టణంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవంబరు 9న బాధిత అక్కాచెల్లెళ్లు తమ ఇంటికి వెళ్లేందుకు వాహనం కోసం ఎదురుచూస్తున్నారు. కైలాశహర్ పట్టణం సమీపంలోని ఓ వంతెన వద్ద వాహనాల కోసం ఎదురు చూస్తున్న వీరి ముందు ఓ ఆటో వచ్చి ఆగింది. అందులో డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు ప్రయాణికులు ఉన్నారు. ఆటో డ్రైవర్ తెలిసినవాడే కావడంతో, బాధితులు ఇద్దరూ అందులో ఎక్కారు. అయితే, ఆటో కొద్ది దూరం వెళ్లగానే అందులోని ఇద్దరు వ్యక్తులూ అక్కాచెల్లెళ్లను టవల్స్‌తో చుట్టేసి, ఖొవాయి జిల్లాలోని తెలిముర పట్టణానికి తీసుకెళ్లారు. అక్కడ ఓ గదిలో వారిని బంధించి రెండు రోజుల పాటు ముగ్గురూ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం రెండు రోజుల తర్వాత తెలిముర రైల్వేస్టేషన్ వద్ద వదిలిపెట్టారు. జరిగిన దారుణాన్ని రైల్వే పోలీసులకు బాధితులు తెలియజేశారు. దీంతో వారు మహిళా పోలీసులకు సమాచారం అందించి, బాధితులను వారికి అప్పగించారు. బాధిత అక్కాచెల్లెళ్ల గురించి వారి తల్లిదండ్రులకు తెలియజేసి పిల్లల్ని నవంబరు 12న అప్పగించారు. బాలికల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మిగతా ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Tags:Rape in Tripura, rape on sackcloths

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *