-మనస్తాపంతో బాలిక ఆత్మహత్య
పుంగనూరు ముచ్చట్లు:
ఇటుకల బట్టిలో పనికి తీసుకెళ్లి మైనర్ బాలికపై అత్యాచారం చేయడంతో ఆబాలిక అవమానంతో ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆదివారం మండలంలోని కమతంపల్లి గ్రామంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఆనంద, ధనలక్ష్మీల కుమారై హేమలత(17) తన తల్లితో కలసి అదే గ్రామానికి చెందిన గణేష్ ఇటుకల బట్టిలో పనికి వెళ్లింది. ఈ సమయంలో గణేష్ ఆబాలికపై అత్యాచారం జరిపాడు. కేకలు వేయడంతో బాలిక తల్లి కుమారైను కాపాడే ప్రయత్నం చేసింది. ఈ సమయంలో నిందితుడు గణేష్ పరారైయ్యాడు. ఇలా ఉండగానే హేమలత తీవ్ర మనస్థాపానికి గురై ఇటుకల బట్టి వద్ద ఉన్న చెట్టుకు ఉరి వేసుకుంది. వెంటనే తల్లి , గ్రామస్తులు కలసి కాపాడే ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకపోయింది. మైనర్ బాలిక అప్పటికే మృతి చెందడంతో ఆకుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఈ మేరకు బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శవాన్ని పోస్టుమార్టంకు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Tags; Rape of minor girl