Rape on a minor girl

మైనర్ బాలికపై అత్యాచారం

నిందితుల అరెస్ట్….

Date:08/12/2019

తిరుపతి ముచ్చట్లు:

సమీపంలో ముళ్ళపూడిలో వద్ద 16 ఏళ్ళ మైనర్ బాలికను ఇద్దరు యువకులు రేప్ చేశారు. లిఫ్ట్ ఇస్తామని చెప్పి ముళ్ళపొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన తిరుచానూరు పోలీసులు ముద్దాయిలను అరెస్ట్ చేశారు. తిరుపతి రూరల్ మండలం, బ్రహ్మణపట్టుకు చెందిన వెంకటేష్, పద్మావతిపురంకు చెందిన రాజమోహన్ నాయక్ లు నవంబర్ 24వ తేదీ రాత్రి ఓ మైనర్ బాలికను అత్యాచారం చేసినట్లు డిఎస్పీ మురళీకృష్ణ తెలిపారు.24వ తేదీ రాత్రి పద్మావతిపురం వద్ద బైక్ పై వెళుతున్న వెంకటేష్ ను బాలిక లిఫ్ట్ అడిగింది.దీంతో వెంకటేష్ తిరుచానూరు వరకు లిఫ్ట్ ఇస్తానని చెప్పి బైక్ ఆపకుండా ముళ్ళపూడికి తీసుకెళ్ళాడు.బండికి పెట్రోల్ అయిపోయిందని చెప్పి తన స్నేహితుడు రాజా మోహన్ నాయక్ కు ఫోన్ చేసి రమ్మని చెప్పాడు.అనంతరం ఇద్దరు కలిసి ముళ్లపొదళ్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసారు.బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేయడం జరిగిందని డిఎస్పీ మురళీ కృష్ణ తెలిపారు. రాజా మోహన్ నాయక్ ఓ హత్య కేసులో ముద్దాయిగా గుర్తించామని ఆయన చెప్పారు.అత్యాచార సంఘటనలో ముద్దాయిలు ఉపయోగించిన బైక్స్ కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

 

డిసెంబ‌రు 9న చ‌క్ర‌తీర్థ ముక్కోటి

 

Tags:Rape on a minor girl

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *