విద్యార్ధినిపై రేప్…ఉపాధ్యాయుడికి మరణశిక్ష

Date:15/03/2019
గాంధీనగర్ ముచ్చట్లు:
సమాజంలో ఉపాధ్యాయులకు ప్రత్యేక గౌరవం ఉంటుంది. పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పి వారిని ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత గురువులదే. అయితే వారి బుద్దే వక్రమార్గం పడితే ఏం చేయాలి?. కన్నబిడ్డలా చూసుకోవాల్సిన బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన కీచక టీచర్కు న్యాయస్థానం రూ.11వేల జరిమానాతో పాటు పదేళ్ల జైలు శిక్ష విధించింది. గుజరాత్లోని దియోదర్లో నివసిస్తున్న చన్బు భగోరా(30) అనే యువకుడు పట్టణ శివారులోని ఓ పాఠశాలలో పనిచేస్తున్నాడు. 2017, ఆగస్ట్ 2న తన స్కూల్లోనే చదువుతున్న బాలికకు లిఫ్ట్ ఇచ్చాడు. అయితే స్కూల్కు తీసుకెళ్లకుండా బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని హెచ్చరించాడు. అయితే తనపై జరిగిన అఘాయిత్యాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం భగోరా నేరానికి పాల్పడినట్లు నిర్ధారించి జైలుశిక్ష విధించారు. తీర్పు సందర్భంగా నిందితుడిపై న్యాయమూర్తి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన సమాజం తలదించుకునేలా ఉందని, టీచర్, స్టూడెంట్ సంబంధానికే కళంకం తెచ్చేలా ఉందని వ్యాఖ్యానించారు.
Tags:Rape on a student … the death penalty for the teacher

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *