కూతురు ఫ్రెండ్ పై రేప్..

Date:22/05/2019

హైద్రాబాద్ ముచ్చట్లు:

కూతురు వయసున్న బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడు. బాధితురాలు అతడి కూతురు స్నేహితురాలు కావడం మరింత విచారకరం. బాధితురాలి కుటుంబసభ్యులు నిలదీయడంతో పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి మొహం చాటేశాడు. తర్వాత వారిని బెదిరించడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం గడియగౌరారం గ్రామానికి చెందిన హలీమ్‌ మేకర్‌ మహ్మద్‌ షరీఫ్‌(40) కుటుంబం గతంలో హైదరాబాద్‌లోని బొగ్గులకుంటలో నివసించేంది. ప్రస్తుతం బండ్లగూడ ఆనంద్‌నగర్‌లో ఉంటున్నారు. బొగ్గులకుంటలో ఉన్నప్పుడు అతని కుమార్తె స్నేహితురాలు(20) అప్పుడప్పుడు ఇంటికొచ్చేది. ఓసారి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేశాడు. బాధిత కుటుంబ సభ్యులు షరీఫ్‌ను నిలదీయగా పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి తర్వాత మొహం చాటేశాడు. బాధితురాలు ఇటీవల ఓ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు షరీఫ్‌పై ఒత్తిడి పెంచారు. ఈ విషయాన్ని షరీఫ్‌ తన సోదరుడు మహ్మద్‌ చాంద్‌ (37)కు చెప్పడంతో అతడు బాధిత కుటుంబ సభ్యులను చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో భయపడిన బాధిత కుటుంబం ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకుని నారాయణగూడ పీఎస్‌కు బదిలీచేశారు. నారాయణగూడ పోలీసులు షరీఫ్‌, చాంద్‌‌ను  అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

 

ఇస్రో గఘన విజయం

Tags: Rape on daughter’s friend

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *