తల్లి సహకారం..అమ్మాయిపై రేప్

Date:07/12/2019

విజయవాడ ముచ్చట్లు:

తల్లి సహకారంతో ఓ కామాంధుడు రెచ్చిపోయాడు. ప్రేమ పేరుతో ఓ బాలికకు మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకొచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. కృష్ణా జిల్లా విజయవాడలోని విద్యాధరపురంలో ఈ ఘటన జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు..విజయవాడలోని హెచ్‌బీ కాలనీకి చెందిన 15 ఏళ్ల బాలికను విద్యాధరపురం ప్రాంతానికి చెందిన సాయి అనే యువకుడు కొన్నాళ్లుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ప్రేమిస్తున్నానంటూ బాలిక వెంటపడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 2న బాలికకు మాయమాటలు చెప్పి విద్యాధరపురంలోని తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దుశ్చర్యకు అతడి తల్లి కూడా సహకరించింది. దీన్ని అదనుగా చేసుకుని బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. అనంతరం కుటుంబ సభ్యుల సహకారంతో బాధితురాలు ఈ నెల 6న రాత్రి విజయవాడ, భవానీపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

 

గవర్నర్ తో టీ కాంగ్రెస్ నేతల  భేటీ

 

Tags:Rape on Mother’s Cooperation

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *