Date:27/01/2021
న్యూ ఢిల్లీ ముచ్చట్లు:
కరోనా వైరస్ విజృంభణ కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నం అయిపోయింది. 2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో జీడీపీ మైనస్ 23.9 శాతానికి క్షీణించింది. కరోనా కారణంగా ప్రపంచ దేశాల పరిస్థితి కూడా ఇదే. అమెరికా బ్రిటన్ జపాన్ చైనా దేశాల ఆర్థిక వ్యవస్థ దశాబ్దాల కనిష్టానికి పడిపోయింది. అయితే ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యలతో భారత్ వేగంగా పుంజుకుంటోంది. ఈ నేపథ్యంలో వివిధ సంస్థలు భారత ప్రపంచ వృద్ధిపై అంచనాలు వేస్తున్నాయి.భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంటోందని ఐక్య రాజ్య సమితి తెలిపింది. 2020 క్యాలెండర్ ఏడాదిలో వృద్ధి మైనస్ 9.6 శాతంగా ఉండగా 2021లో 7.3 శాతం వృద్ధి నమోదు కావొచ్చునని ఐక్య రాజ్య సమితి తెలిపింది. ఈ మేరకు వరల్డ్ ఎకనమిక్ సిచ్యుయేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ 2021 రిపోర్ట్ ను ఐక్య రాజ్య సమితి సోమవారం విడుదల చేసింది.
కరోనా కారణంగా ప్రభుత్వం భారీ ఆర్థిక ప్యాకేజీ ద్రవ్య ఉద్దీపన ప్రకటించినప్పటికీ లాక్ డౌన్ వంటి కారణాలతో జీడీపీ భారీగా క్షీణించినట్లు తెలిపింది. దేశీయ డిమాండ్ పూర్తిగా పడిపోయిందని తెలిపింది. 2022 క్యాలెండర్ ఏడాదిలో భారత వృద్ధి రేటు 5.9 శాతంగా నమోదవుతుందని తెలిపింది.కరోనా కారణంగా ప్రపంచం తీవ్ర సంక్షోభంలోకి వెళ్ళిందని ఆర్థిక వ్యవస్థలు చితికిపోయాయని మెజార్టీ ప్రపంచంలో వృద్ధి నెమ్మదిగా కనిపిస్తోందని ఐక్య రాజ్య సమితి చీఫ్ ఎకనమిస్ట్ ఎలియోట్ హారిస్ తెలిపారు. వ్యాక్సినైజేషన్ రాక కరోనా నుండి ప్రపంచం కోలుకుంటున్న నేపథ్యంలో మరోసారి ఆర్థికంగా దెబ్బతినేలా కఠిన నిర్ణయాలు తీసుకోవద్దని అలా అయితే ఆర్థిక వ్యవస్థలు చితికిపోతాయని హెచ్చరించారు. వ్యాక్సినైజేషన్ నేపథ్యంలో దీర్ఘకాలిక పెట్టుబడులు ప్రోత్సహించాలన్నారు.
విశిష్ట సేవలందించిన ఎంవిఐ సుబ్రమణ్యంకు కలెక్టర్ చే ప్రశంసాపత్రం
Tags: Rapidly recovering Indian economy: United Nations