మణిపాల్ ఆస్పత్రిలో అరుదైన కాలేయ మార్పిడి ఆపరేషన్లు
విజయవంతంగా 12 మందికి కాలేయ మార్పిడి ఆపరేషన్లు
విజయవాడ ముచ్చట్లు:
మణిపాల్ హాస్పిటల్ సౌత్ ఏషియన్ లివర్ ఇనిస్టిట్యూట్ భాగస్వామ్యంతో 12 మందికి ఆరుదైన కాలేయ మార్పిడి ఆపరేషన్లు చేసినట్లు ఆ ఆసుపత్రి డైరెక్టర్ డా. సుధాకర్ కంటిపూడి అన్నారు. మణిపాల్ హాస్పిటల్ విజయవాడలో కాలేయ చికిత్సకు సంబంధించి కావలసిన వైద్య సదుపాయాలు అన్నీ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయి. వైద్య నిపుణులు, పారామెడిక్స్ టీం లు 24గంటలూ అందుబాటులో ఉంటారు. భారతదేశంలో సుమారు 50వేల మంది కాలేయ మార్పిడి కోసం ఎదురుచూస్తున్నారు. కేవలం 25 కాలేయ మార్పిడి కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. . ఇవి సంవత్సరానికి 800 నుండి 1,000 మార్పిడిని నిర్వహిస్తున్నాయి. మణిపాల్ లో అందుబాటులోకి వచ్చిన అధునాతన సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ఈ ఆపరేషన్లకు 30 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ప్రభుత్వం సి.ఎం.ఆర్.ఎఫ్ కింద పది లక్షల వరకు సాయం అందిస్తుంది. 12 మందికి విజయవంతంగా కాలేయ మార్పిడి చికిత్స చేశామని అన్నారు.

ప్రొఫెసర్ డాక్టర్ టామ్ చెరియన్ మాట్లాడుతూ మణిపాల్ హాస్పిటల్ లో అత్యంత క్లిష్టమయిన కాలేయ శస్త్రచికిత్సలను పూర్తి చేశాం. ముఖ్యంగా మరణాంతర కాలేయ మార్పిడి, కాలేయ దాతల ద్వారా చేసే మార్పిడి. క్యాన్సర్లకు లివర్ రెసెక్షన్లు, పోర్టల్ వెయిన్ థ్రాంబోసిస్ కోసం మార్పిడి చేసాం. చిన్న వయసు వారిలో కాలేయ మార్పిడి లాంటి మొదలైనవి నిర్వహించాం. కాలేయ వ్యాధి నాణ్యమైన చికిత్సకు సరైన నిపుణుల బృందం మౌలిక సదుపాయాలు అవసరం. కాలేయ మార్పిడి అనేది సంక్లిష్టమైన డిమాండ్ ఉన్న శస్త్రచికిత్స. ఇప్పటి వరకు కాలేయ మార్పిడి శస్త్రచికిత్స కోసం రోగులు ఇతర రాష్ట్రాల వైపు చూసే వారు. కీలకమైన కాలేయ శస్త్ర చికిత్సలు మణిపాల్ హాస్పిటల్- సౌత్ ఏషియన్ భాగస్వామ్యంలో చేస్తున్నాం. లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ పై ప్రజల్లో ఉన్న వివిధ అపోహలు కూడా తొలగించుకోవాలి. చివరి దశకు చేరుకున్న వారికి కూడా అధునాతన కాలేయ మార్పిడి పద్ధతుల ద్వారా అద్భుతమైన చికిత్సలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు.
Tags; Rare Liver Transplant Operations at Manipal Hospital
