విజయ్ తో  రాశీఖన్నా చెట్టాపట్టాల్

Rashekhana with Vijay Chettapattal

Rashekhana with Vijay Chettapattal

Date:14/08/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
‘అర్జున్ రెడ్డి’ హీరో విజయ్ దేవరకొండ సినిమా ప్రతిపాదనలు శరవేగంగా సాగుతున్నాయి. గత ఏడాది కాలంలో, అర్జున్ రెడ్డి తర్వాత ఈ హీరో ఫుల్ లెంగ్త్ సినిమాలేవీ విడుదల కాలేదనే చెప్పాలి. ‘మహానటి’లో విజయ్ నటించినా హీరోగా కాదు. ఈ నేపథ్యంలో ఇతడు హీరోగా  ‘గీతగోవిందం’ విడుదల కాబోతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలను ఇది ఏ మేరకు అందుకుంటుందనేది  ఈ పాటికి స్పష్టత వస్తుంది. ఇక విజయ్ తదుపరి సినిమాలు ప్రస్తుతం మేకింగ్ దశలో ఉన్నాయి.
‘నోటా’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాలు రూపొందుతున్నాయి. అవి మాత్రమే గాక ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ దర్శకుడు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమాలో ఇప్పుడు హీరోయిన్ ఫిక్సయినట్టుగా తెలుస్తోంది. రాశీ ఖన్నాను ఎంచుకున్నారని సమాచారం. విజయ్ సరసన నటించడానికి రాశీ ఖన్నా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టుగా తెలుస్తోంది. వరసగా యంగ్ హీరోల సరసన నటిస్తోంది ఈ హీరోయిన్. ఇప్పుడు యూత్ క్రేజీ హీరో విజయ్ సరసన జత కడుతోంది. ‘గీతగోవిందం’ హిట్ అయితే విజయ్ దేవరకొండ తదుపరి సినిమాలపై అంచనాలు, ఆసక్తి మరింత పెరుగుతాయి.
Tags:Rashekhana with Vijay Chettapattal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *