ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా రాస్తారోకో

Date:05/12/2020

కౌతాళం ముచ్చట్లు:

వ్యవసాయ బిల్లు రద్దు చేయాలని, విద్యుత్తు ప్రైవేటీకరణ బిల్లు రద్దు చేయాలని, బోరు బావుల మోటార్లకు కరెంట్ మీటర్ లు బిగించ రాదని కోరుతూ గత పది రోజులుగా దేశవ్యాప్తంగా రైతాంగం ఢిల్లీలో చేస్తున్న ఆందోళనకు మద్దతుగా రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కౌతాళం మండలం ఎరిగేరి గ్రామంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మల్లయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు  లింగన్న, మాజీ ఎస్ఎఫ్ఐ నాయకులు వీరేష్ మాట్లాడారు, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చిన్న సన్నకారు రైతుల నడ్డివిరిచే బిల్లును రద్దు చేయాలని, బిల్లును రద్దు చేసేంతవరకు దేశ వ్యాప్తంగా ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు. అందులో భాగంగా 8 న ఇచ్చిన భారత్ బంద్ ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు మహాదేవ, రాజు, తిమ్మప్ప,వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు వీరేష్, ఈరన్న, సి ఐ టి యు నాయకులు రామలింగ ,ఈరన్న, బసవరాజు, డప్పు కళాకారులు సంఘం నాయకులు సుందరరాజు, డివైఎఫ్ఐ నాయకులు హనుమంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాం- మంత్రి పెద్దిరెడ్డి

Tags: Rastaroko in support of the concern of farmers in Delhi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *