మెడికల్ కాలేజి ఏర్పాటు చేయాలని  ఎంసీపీఐ యూ ఆధ్వర్యంలో రాస్తారోకో

బెల్లంపల్లి  ముచ్చట్లు:

ప్రభుత్వం జిల్లాకు  కేటాయించిన మెడికల్ కాలేజి   బెల్లంపల్లిలో  ఏర్పాటు చేయాలని ఎంసీపీఐ యూ  పార్టీ జిల్లాకార్యదర్శి సబ్బని కృష్ణ ఆధ్వర్యంలో మార్కెట్ ఏరియా  కాంటా చౌరస్తాలోరాస్తారోకో.చేపట్టారు. బజార్ లో ఇరువైపులా  వాహనాలు నిలిచిపోయాయి అనంతరం ఆయన మాట్లాడుతూ మెడికల్ కాలేజ్ బెల్లంపల్లిలో నెలకొల్పడానికి అన్నివిధాల అనువైన ప్రాంతమని,2 జిల్లాలకు 5 నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటుందని,9దశాబ్దాల ఘనమైన బొగ్గుగనుల చరిత్ర కలిగిన పట్టణం బెల్లంపల్లి  అని,లక్ష జనాభా గల మున్సిపాలిటీ ప్రాంతమని,నియోజకవర్గ కేంద్రం లోజాతీయ రహదారి రైల్వేస్టేషన్ , సింగరేణి,ప్రభుత్వ ఆస్పత్రులు కూడా ఉన్నాయని,23సంవత్సరాల క్రితమే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే బెల్లంపల్లి అనువైన ప్రాంతమని ఇక్కడ మెడికల్ కాలేజ్ ని అప్పటి ప్రభుత్వం మంజూరు చేసింది ,టెస్లాఎడ్యుకేషన్ సొసైటీ హైదరాబాద్ కంపెని  10 కోట్లు ఖర్చుపెట్టి కెమికల్ లోని బిల్డింగులకు మరమ్మతులు చేసారని, సింగరేణి బిల్డింగులు,ప్రభుత్వ భూములు పుష్కలంగా ఉన్నాయని,ప్రభుత్వం పైన ఆర్థిక భారం కూడా పడదని, ముఖ్యమంత్రి  వెంటనే స్పందించి బెల్లంపల్లిలో మెడికల్ కాలేజ్ ను ఏర్పాటుచేయాలని అన్నారు..

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

 

Tags:Rastaroko under the auspices of MCPI U to set up a medical college

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *