చిన్న మొత్తాలపై వడ్డీరేట్ల పెంపు

Rate of interest rates on small amounts

Rate of interest rates on small amounts

Date:20/09/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు :
 చిన్న మొత్తాలపై వడ్డీరేట్లను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనితో మధ్యతరగతి ప్రజలకు ఊరట కలుగనుంది. అక్టోబరు-డిసెంబరు త్రైమాసికానికి గానూ జాతీయ పొదుపు(ఎన్‌ఎస్‌సీ), ప్రజా భవిష్యనిధి(పీపీఎఫ్‌)లాంటి చిన్న మొత్తాలపై ప్రస్తుతం ఉన్న వడ్డీరేటును 0.4శాతం పెంచింది. బ్యాంకుల్లో డిపాజిట్‌ రేట్లు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
సాధారణంగా చిన్న మొత్తాలపై వడ్డీరేట్లను మూడు నెలలకోసారి సవరిస్తూ ఉంటారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(అక్టోబరు 1 నుంచి డిసెంబరు 31)లో చిన్న మొత్తాలపై వడ్డీరేట్లను పెంచినట్లు కేంద్ర ఆర్థికశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
తాజా పెంపుతో ఐదేళ్ల కాలపరిమితితో చేసిన డిపాజిట్లపై 7.8శాతం, రికరింగ్‌ డిపాజిట్‌పై 7.3శాతం, సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌పై 8.7శాతం వడ్డీరేటు ఉండనుంది.ఇక పీపీఎఫ్‌, ఎన్‌ఎస్‌సీలపై ప్రస్తుతం ఉన్న వడ్డీరేట్లను 7.6శాతం నుంచి 8శాతానికి పెంచారు. కిసాన్‌ వికాస్‌ పత్రా పథకంపై వడ్డీరేటును 7.7శాతానికి, సుకన్య సమృద్ధి ఖాతాలపై ప్రస్తుతమున్న 8.1శాతం వడ్డీరేటును 8.5శాతానికి పెంచారు.
Tags:Rate of interest rates on small amounts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *