రధం మూవీకి సోషల్ మీడియాలో పాజిటివ్ రెస్పాన్స్

Ratham is a positive response to the movie's social media

Ratham is a positive response to the movie's social media

Date:06/10/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
గీత్ ఆనంద్, చాందినీ భగ్వానాని జంటగా తెరకెక్కిన చిత్రం ‘రథం’. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. శనివారం దర్శకుడు క్రిష్ జాగర్లమూడి చేతులు మీదుగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ‘యుగాల నాటి కురుక్షేత్ర యుద్ధం కూడా ధర్మం కోసమే’ అంటూ ఆయన ఈ ట్రైలర్ ట్వీట్ చేశారు. ఇటీవల విడుదలైన టీజర్లో.. గీత్ ఆనంద్, చాందినీల రొమాంటిక్ సన్నివేశాలను కొత్తగా చూపించి ఆకట్టుకున్నారు.
తాజా ట్రైలర్లో మాత్రం.. యాక్షన్ సన్నివేశాలతో రక్తికట్టించారు. ఈ ట్రైలర్‌లో డైలాగులు, పోరాట సన్నివేశాలు, విజువల్స్ చూస్తుంటే మంచి క్వాలిటీతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ ట్రైలర్ చివరిలో హీరో చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ‘‘18 రోజుల యుద్ధం, లక్షల శవాలు.. కురుక్షేత్ర యుద్ధం కూడా ధర్మం కోసమే..’’ అంటూ.. రక్తికట్టించారు.
‘‘పెద్దంతరం.. చిన్నంతరం లేకుండా పెంచిందా బాబూ మీ అమ్మ. గుమ్మం ముందుకు వచ్చి రొమ్ము విసురుతున్నావేంటి?’’, ‘‘మంచోడు పక్కింట్లో ఉంటే మనోడు అంటాం. అదే వాడు మన ఇంట్లో ఉంటే ఇవన్నీ మనకు ఎందుకు రా అంటాం’’ వంటి డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి. కె.చంద్రశేఖర్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీకి పాజిటివ్ టాక్ నడుస్తోంది.
Tags:Ratham is a positive response to the movie’s social media

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *