Natyam ad

ఫిబ్ర‌వరి 16న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రథసప్తమి

తిరుపతి ముచ్చట్లు:

ఫిబ్ర‌వరి 16వ తేదీన రథసప్తమి పర్వదినం సందర్భంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు ఏడు వాహనాలపై ఊరేగి భక్తులనుఅనుగ్రహించనున్నారు.  ఉదయం 7.15 నుండి 8.15 గంటల వరకు సూర్యప్రభ వాహనం, ఉదయం 8.45 నుండి 9.45 గంటల వరకు హంస వాహనం, ఉదయం 10.15 నుండి 11.15 గంటల వరకు అశ్వ వాహనం, ఉదయం 11.45 నుండి మధ్యాహ్నం 12.45 గంటల వరకు గరుడ వాహనంపై విహ‌రించి భ‌క్తుల‌ను క‌టాక్షించ‌నున్నారు. మధ్యాహ్నం 1.15 నుండి 2.15 గంటల వరకు చిన్నశేష వాహనం, సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు చంద్రప్రభ వాహనం, రాత్రి 8.30 నుండి 9.30 గంటల వరకు గజ వాహనంపై ద‌ర్శ‌న‌మిస్తారు.  కాగా సాయంత్రం 3.30 నుండి 4.30 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోని శ్రీ కృష్ణస్వామివారి ముఖ మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు.

 

Post Midle

ఈసందర్భంగా అమ్మవారి ఆలయంలో నిర్వహించే ల‌క్ష్మీపూజ‌, ఆర్జిత కల్యాణోత్సవం, కుంకుమార్చ‌న‌, బ్రేక్ ద‌ర్శ‌నం, ఊంజ‌ల‌సేవ‌,  సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం పక్కన గల శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఉదయం 6 నుండి 7 గంటల వరకు స్వామివారు అశ్వవాహనాన్ని అధిష్టించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.ఫిబ్ర‌వరి 13న  కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం    శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఫిబ్ర‌వరి 13వ తేదీ ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు.

 

Tags:Rathasaptami at Sri Padmavati Ammavari Temple, Tiruchanur on 16th February

Post Midle