ఒక్క రోజులోనే రేషన్ కార్డు

Date:17/09/2020

కాకినాడ ముచ్చట్లు:

ఏపీలో ఒక్క రోజులోనే రేషన్ కార్డు మంజూరైంది. దరఖాస్తు చేసుకున్న రోజే కొత్త కార్డు వచ్చేసింది.. సరికొత్త రికార్డు నమోదైనట్లైంది. తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం మడికి పంచాయతీ సచివాలయం–2 పరిధిలో నివాసం ఉంటున్న కుడిపూడి ఆంజనేయులు, వరలక్ష్మి దంపతులు గతంలో ఎన్నోసార్లు రేషన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నా రాలేదు. దీంతో గ్రామ వాలంటీర్‌‌ను కలవగా.. మంగళవారం గ్రామ సచివాలయానికి తీసుకెళ్లి వివరాలు నమోదు చేయించాడు. దరఖాస్తును ఆన్‌లైన్‌ ద్వారా తహసీల్దార్‌ సమర్పించగా.. ఆయన వెంటనే లబ్ధిదారుని అర్హతల్ని గుర్తించి బుధవారం రేషన్‌ కార్డు మంజూరు చేశారు. అలాగే అదే గ్రామానికి చెందిన పిల్లి లక్ష్మి అనే ఒంటరి మహిళకు కూడా ఒక్క రోజులోనే రేషన్‌ కార్డు మంజూరు చేశారు.గతంలో రేషన్ కార్డు కావాలంటే చాలా రోజులు తిరగాల్సి వచ్చేదని.. ఇప్పుడు ఒక్కరోజులోనే కార్డు రావడంతో ఆ కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అర్హతలున్న వారు వాలంటీర్‌ ద్వారా దరఖాస్తు చేసుకుంటే గ్రామ సచివాలయం ద్వారా పది రోజుల్లో కార్డు అందజేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఆ దిశగానే ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కానీ ఇక్కడ మాత్రం ఒక్కరోజులోనే అర్హత గుర్తించి రేషన్ కార్డు మంజూరు చేయడంపై హర్షం వ్యక్తమవుతోంది.

వ్యూహ‌త్మక అడుగుల‌తో చంద్ర‌బాబు

Tags: Ration card in one day

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *