Ration card issued in 10 minutes in Punganur

పుంగనూరులో 10 నిమిషాల్లో రేషన్‌కార్డు మంజూరు

– కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Date:23/09/2020

పుంగనూరు ముచ్చట్లు:

సచివాలయాలలో అర్జీ దాఖలు చేసిన పది నిమిషాల వ్యవధిలో సమగ్ర విచారణ జరిపి, రేషన్‌కార్డును మంజూరు చేశామని కమిషనర్‌ కెఎల్‌.వర్మ తెలిపారు. బుధవారం ఆయన తహశీల్ధార్‌ వెంకట్రాయులతో కలసి పది నిమిషాలలో రేషన్‌కార్డును లబ్ధిదారుకు అందజేశారు. కమిషనర్‌ మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలోని 16 సచివాలయాలలోను అన్ని రకాల సేవలు సత్వరంగా నిర్వహిస్తున్నామన్నారు. 1206 మంది వివిధ రకాల సేవల కోసం ధరఖాస్తు చేయగా వాటిలో 1111 సేవలు పరిష్కరించి, రికార్డు సృష్టించామన్నారు. పట్టణంలో ఉదయం దాఖలు చేసిన వ్యక్తికి పదినిమిషాల్లో జుబేర్‌ఖాన్‌కు రేషన్‌కార్డు, మరో ఇద్దరికి గంటలోపు రేషన్‌కార్డులు మంజూరు చేశామన్నారు. ప్రభుత్వం ఐదు రోజుల్లో రేషన్‌కార్డు మంజూరు చేయాలని ఆదేశించిన నేపధ్యంలో మరింత పారదర్శకంగా, వేగవంతంగా గంటల వ్యవధిలోనే మున్సిపాలిటిలో అన్ని రకాల సేవలు సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రజా సేవలో సచివాలయ కార్యదర్శులు, వలంటీర్లు పని చేస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా రెవెన్యూ అధికారులు అందిస్తున్న సహకారం మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజర్‌ రసూల్‌ఖాన్‌, కౌన్సిలర్‌ అభ్యర్థి అమ్ము తదితరులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని ర్యాలీ

Tags; Ration card issued in 10 minutes in Punganur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *