రేషన్ డీలర్ల కమీషన్ 75 పైసల నుంచి రూ. ఒక్క రూపాయికి పెంపు

Ration dealers' commission from 75 paise to Rs. Hike to one rupee

Ration dealers' commission from 75 paise to Rs. Hike to one rupee

Date:12/01/2019
గుంటూరు ముచ్చట్లు:
రాష్ట్రంలో రేషన్ డీలర్ల కోరిక మేర నిత్యావసర సరుకుల పంపిణీ కమీషన్ను సంక్రాంతి కానుకగా 75 పైసల నుంచి రూ. ఒక్క రూపాయికి పెంచుతున్నామని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో ఉన్న 29 వేల రేషన్  డీలర్లకు లబ్ధి చేకూరుతుందని అయన అన్నారు. శనివారం అయన మీడియాతో మాట్లాడారు. రేషన్ డీలర్ల కమిషన్ను ఒక్క రూపాయి చేయాలని సీఎం ఆదేశించారు. బియ్యం, పంచదార, రాగులు, జోన్నలు, కందిపప్పు కమిషన్ ఒక్క రూపాయి చేశాం. అన్ని నిత్యావసర సరుకుల పంపిణీ కమీషన్ను పెంచాం. 85 శాతం సంతృప్తి దాటిన డీలర్లకు ప్రతి నెల రూ 2 వేలు ప్రోత్సాహకం ఇస్తామని మంత్రి  అన్నారు. 25 పైసలు ఉన్న కమిషన్ టీడీపీ అధికారంలోకి వచ్చాక రూపాయికి చేశాం. గత సంవత్సరం చంద్రన్న కానుకల కమిషన్ రూ 5 నుంచి రూ. 10 కు పెంచాం. కార్డుదారులకు కేజీ రూపాయికే బియ్యం ఇస్తున్నాం ఆ రూపాయి డీలర్ల కమిషన్  సరిపోతుంది. రేషన్ డీలర్లకు అన్ని వేళలా తెదేపా ప్రభుత్వం అండగా ఉంటుంది. సీం పింఛన్లను పది రెట్లు పెంచి ప్రతి ఇంట పెద్దకొడుకు అని నిరూపించుకున్నారని అయన అన్నారు. చంద్రన్న నిర్ణయంతో సంక్రాంతికి ముందే పండుగ వాతావరణం నెలకొంది. ఏపిలో ఇచ్చినట్లు దేశంలో, ఏ రాష్టంలో కూడా ఇన్ని రకాల పింఛన్లు ఇవ్వడం లేదు. తెలంగాణా రాష్ట్రంలో కూడా 5 రకాల పింఛన్లను మాత్రమే ఇస్తున్నారు. పేదల సంక్షేమానికీ చంద్రబాబునాయుడు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నారని మంత్రి అన్నారు.
Tags:Ration dealers’ commission from 75 paise to Rs. Hike to one rupee

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *