బియ్యం పంపిణీలో రేషన్ డీలర్ చేతివాటం
-అప్రమత్తమైన అధికారులు
నంద్యాల ముచ్చట్లు:
నంద్యాల పట్టణంలో 1384124 రేషన్ షాపు డీలర్ అయిన షేక్ సాయిన్ పర్వీన్ . పై శిక్ష కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు . డిసెంబర్ నెలలో పంచాల్సిన కేంద్ర ప్రభుత్వ బియ్యం
గోడంగు లలో తగిన నిల్వలు లేక పోవడంతో జనవరి నెల కోటాతో కలిపి రెండు నెలల బియ్యం డీలర్ల కు చేరవేయడం జరిగిందని అన్నారు . డీలర్లు రెండు నెలల బియ్యం కలిసి కార్డు దారులకు పంపిణీ
చేయాల్సి ఉంది. . 1384124 షాపు డీలర్ షేక్ సాయిన్ పర్వీన్ షాపు యందు నిల్వలను బట్టి చూస్తే . కార్డు దారులకు ఓక నెలవి మాత్రమే పంపిణీ చేస్తున్నట్లు తెలిస్తోందని అన్నారు . డీలర్ కార్డు
దారులకు తెలియదని అనుకున్నోడో ఏమో కానీ ఈ విషయం రెవెన్యూ అధికారుల దృష్టికి పోయింది . వెనువెంటనే అధికారులు . రేషన్ షాపును తనిఖీ చేశారు. ప్రభుత్వం వారు ఇచ్చిన నిల్వ కంటే
అధికంగా 16 క్వింటాళ్ల 70 కేజీల బియ్యం అదనంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వెనువెంటనే డీలర్ పై శిక్ష కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు. వారు మాట్లాడుతూ ప్రతి డీలర్ రెండు
నెలల బియ్యం కలిపి ఖచ్చితంగా కార్డు దారులకు పంపిణీ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నంద్యాల సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ ప్రసాద్. మరియు రెవెన్యూ ఇన్ స్పెక్టర్ యుగందర రెడ్డి. వీ ఆర్ ఓ
లు పాల్గొన్నారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Ration dealer’s hand in rice distribution