కరోనా పై యుద్ధం చేస్తున్న రేషన్ డీలర్లు

-రేషన్ డీలర్ల ను గుర్తించని ప్రభుత్వ అధికారులు

Date:22/05/2020

నంద్యాల  ముచ్చట్లు:

నంద్యాల పట్టణంలో రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం కోశాధికారి కె మదు సుధన్ రావు  మాట్లాడుతూ ఈ కరొన విపత్కర పరిస్తితుల్లో రాష్ట్ర ప్రజానీకాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం వారు ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభించారు . ప్రజా పంపిణీ చేసిన  రేషన్ డీలర్ల విషయంలో మాత్రం ముందు చూపు లేకపోవడం చాలా బాధకరం అని అన్నారు.  రేషన్ డీలర్లు కరోనా వైరస్ తో యుద్ధం చేసినట్లు పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వం వారు మటుకు రేషన్ డీలర్ల కు లైఫ్ ఇన్సూరెన్స్ ప్రకటించక పోవడం చాలా బాధాకరమన్నారు . కరోనా వైరస్ పై వివిధ శాఖల అధికారులకు మాత్రం లైఫ్ ఇన్సూరెన్స్ ను ప్రకటించారు .రేషన్ డీలర్ల కు లైఫ్ ఇన్సూరెన్స్ ప్రకటించలేదు .  ప్రభుత్వం  తన ప్రతిష్ట కోసం రేషన్ డీలర్ల జేబులు ఖాలీ చేసి బలవంతంగా వెట్టుచాకిరి చేయిస్తుండడం చాలా బాధాకరం అని అన్నారు. ప్రత్యేక జాగ్రత్తల మద్య డబుల్ జీతాలతో సేవ చేసే వారు దేవుళ్ళు. వారికి లక్షల్లొ ఇన్సూరెన్స్ లు కుటుంబానికి పూర్తి భద్రత కల్పించారు .

 

 

ఐతే ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా క్లాస్ , మాస్ అనే తేడా లేకుండా వందల మంది కార్డుదారులకు పంపిణీ చేస్తున్న డీలర్ల కు ఇన్సూరెన్స్ లేదు .  హమాలీ చార్జీలు, గుమస్తా జీతాలు , రూం బాడుగలు ,ఇంటర్నెట్ చార్జిలు,కరెంట్ బిల్లు, శానిటైజర్స్ , సబ్బుల రూపంలో వేలాది రూపాయలు ఎదురు డబ్బులు పెట్టి వెట్టి చాకిరీ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. అధికారుల దగ్గర కూడా గుర్తింపు లేక పోవడంతో చాలా బాధాకరం గా ఉందన్నారు. రెషన్ డీలర్ల శ్రమకు గుర్తింపు లేదన్నారు . చెల్లించే కమిషన్లపై స్పష్టత ఏది. రెషన్ డీలర్లకు రక్షణ ఏది. వారి కుటుంబాలకు భద్రత ఏది. మార్చిలో కట్టిన డీడీల డబ్బుల ఊసే లేదు అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల నిర్ణయాలను  అమలు పర్చడానికే పరిమితమైన క్రిందిస్థాయి అదికారులు , రేషన్ డీలర్ల విజ్ఞప్తులను గాలికి వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థ  పై కనీస అవగాహన లేని ప్రభుత్వ యంత్రాoగం.

 

 

ప్రజల కడుపునింపే ప్రజాపంపిణీ వ్యవస్థలో క్షెత్రస్థాయిలో సేవలందించే రేషన్ డీలర్ల కడుపుకొట్టడం చాలా బాధాకరమన్నారు. ప్రభుత్వానికి ఇది భావ్యమా అని ఆవేదనను వ్యక్తం చేశారు. గత రెండు నెలలుగా రూపాయి చెల్లించకుండా డీలర్లచే వెట్టిచాకిరి చేయించుకోవడం సమర్ధనీయమా అని ప్రశ్నించారు.  ప్రతి నెల 5-10 వేల రూపాయలు డీలర్లచే ఎదురు పెట్టించి బలవంతంగా పని చేయించుకోవడం ప్రభుత్వనికి తగునా అని అన్నారు. డీలర్ల వ్యవస్థలోని ఒకరిద్దరు చీడపురుగులను దృష్టిలొ పెట్టుకొని , వ్యవస్థలోని దీర్ఘకాలిక  సమస్యలను పట్టించుకొక పొవడం ఎంత వరకు సమంజసం అని అన్నారు.

జర్నలిస్టుల‌ రాయితీలు కొనసాగుతాయి

Tags: Ration dealers waging war on corona

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *