రాత్రి 9 గంటల వరకు రేషన్ పంపిణీ

పట్టణంలో 15 వార్డులో రాత్రి 9 గంటలకు ఇంటింటికి రేషన్ పంపిణీ
పత్తికొండ  ముచ్చట్లు:
ఉపాధిహామీ వ్యవసాయ పనులకు వెళ్తున్న రేషన్ కార్డు దారులకు ఇబ్బందులు పడకుండా ఉండటం కోసం రాత్రి తొమ్మిది గంటల వరకు రేషన్ పంపిణీ చేస్తున్నామని పట్టణ సచివాలయ కార్యదర్శి రోజా రాణి చెప్పారు. బుధవారం విలేకరులతో ఆమె మాట్లాడుతూ పట్టణంలోని 15 వ వార్డు లో కార్డుదారులకు అనుకూలాన్ని బట్టి మధ్యాహ్నం మూడున్నర గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు కార్డుదారులకు రేషన్ పంపిణీ చేస్తున్నామన్నారు. రేషన్ వేయడానికి ఒక్కొక్కసారి నెట్ పని చేయనప్పుడు ఆలస్యం అవుతుందన్నారు. నెట్ మొరాయించిన సమయంలో కూలీలు అవస్థలు పడుతున్నారని చెప్పారు. కూలీల అవసరాలకు అనుగుణంగా 9:30 గంటల వరకు ఇంటింటికి రేషన్ పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ రోజు దాదాపు 67 మందికి రేషన్ వేశామన్నారు. వర్షం వచ్చినప్పుడు రేషన్ వేయడానికి మరిన్ని ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. ప్రభుత్వం అధిగమించడానికి ఇంటింటికి రేషన్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. కొన్ని సందర్భాల్లో రేషన్ వేయడానికి ఆలస్యం అవుతున్నప్పుడు కార్డుదారుల సహకారం ఎంతో అవసరం ఉంటుందన్నారు. నెట్ పూర్తి పనిచేయనప్పుడు కార్డుదారులు వెనుదిరిగి పోతారని విచారం వ్యక్తం చేశారు. ఈ రోజు ఉదయాన్నే వెళ్లి రేషన్ వేస్తామన్నారు. కార్యక్రమంలో వ్యాలేంటియర్ మాభాష, వాహన డ్రైవర్ అమీర్ పాల్గొన్నారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags:Ration distribution until 9 p.m.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *