పశ్చిమలో రేవ్ కలకలం

Date:11/05/2019
ఏలూరు ముచ్చట్లు:
ప్రశాంతతకు మారుపేరైన పశ్చిమగోదావరి జిల్లాలో రేవ్ పార్టీ కలకలంరేపింది. పెనుమంట్ర మండలం మార్టేరులోని ఓ కళ్యాణ మండపంలో.. శుక్రవారం రాత్రి ఓ బడా వ్యాపార వేత్త పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఐదుగురు యువతుల్ని తీసుకొచ్చి.. వారితో అసభ్య నృత్యాలు చేయించారు. మద్యం మత్తులో పార్టీకి వచ్చిన వారూ డ్యాన్సులేస్తూ రచ్చ, రచ్చ చేశారు. రేవ్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు అర్థరాత్రి కళ్యాణ మండంపై దాడి చేశారట. అసభ్యకరంగా నృత్యాలు చేస్తున్న యువతుల్ని అదుపులోకి తీసుకున్నారు. నలుగురు వ్యక్తుల్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రేవ్ పార్టీపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈ వ్యవహారం వెనుక ఎవరున్నారని ఆరా తీస్తున్నారు. ఈ పార్టీకి ఓ రాజకీయ పార్టీకి చెందిన ముఖ్య నేతలు కూడా హాజరైనట్లు తెలుస్తోంది.
Tags: Rave is in the west

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *