Natyam ad

రావెల.. వెలవెల

గుంటూరు ముచ్చట్లు:

ఆఫీసర్‌ పాత్ర నుంచి రాజకీయాల్లోకి వచ్చీరావడంతోనే మంత్రి అయ్యారు. తర్వాత అడుగులు తడబడి.. పొలిటికల్‌ తెరపై ఫేడ్‌ అవుట్‌ అయ్యారు ఆ మాజీ మంత్రి. ఎన్నో ఆశలతో సొంత గూటికి తిరిగి వెళ్దామని అనుకున్నా.. బ్రేకులు పడ్డాయి. ప్రస్తుతం జంక్షన్‌ జామ్‌. కాలం కలిసి రాక కాలక్షేపం చేయాల్సిందేనా? ఎవరా మాజీ మంత్రి?రావెల కిశోర్‌ బాబు. 2014లో ప్రత్తిపాడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. ఆ వెంటనే మంత్రి అయిపోయారు. టీడీపీ అధికారంలో ఉండగానే.. అసంతృప్తి మూటగట్టుకోవడంతో మధ్యలోనే కేబినెట్ నుంచి ఉద్వాసన తప్పలేదు. తర్వాత టీడీపీకి గుడ్‌బై చెప్పి.. 2019 ఎన్నికలకు ముందు జనసేనలో చేరిపోయారు రావెల. గ్లాసు గుర్తుపై పోటీ చేసినా నెగ్గలేదు. ఆపై అక్కడా కుదురుగా ఉండలేదు. బీజేపీకి జైకొట్టి.. కాషాయ కండువాను మెడలో వేసుకున్నారు. ఈ మధ్య కాలంలో బీజేపీకి హ్యాండిచ్చారు. తిరిగి టీడీపీలోకి వెళ్తున్నట్టు సంకేతాలు ఇచ్చి.. చంద్రబాబుతో సన్నిహితంగా మెలిగి.. తెలుగు తమ్ముళ్లలో అనేక ప్రశ్నలకు కేంద్ర బిందువు అయ్యారు రావెల.మహానాడు సమయంలోనే రావెల కిశోర్‌బాబు టీడీపీలో చేరతారని ప్రచారం జరిగింది. ఏమైందో ఏమో.. ఆయన టీడీపీ కండువా కప్పుకోలేదు. జిల్లా రాజకీయాల్లోనూ యాక్టివ్‌గా లేరు. దీంతో మాజీ మంత్రి రాజకీయ భవిష్యత్‌ ఏంటనేది ప్రశ్నగా మారింది. రావెలను టీడీపీలోకి రాకుండా ప్రత్తిపాడులోని కొన్ని గ్రూపులు అడ్డుకున్నాయట. నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్తగా ఉన్న మాకినేని పెదరత్తయ్య సైతం కార్యకర్తల మనోభావాన్ని పార్టీ పెద్దలకు వివరించారట. గతంలో కిశోర్‌బాబు గ్రూపులు కట్టడం వల్లే ప్రత్తిపాడులో టీడీపీ ఇబ్బంది పడిందని..

 

 

 

ఇప్పుడు ఆయన మళ్లీ వస్తే అదే రిపీట్‌ అవుతుందని పెదరత్తయ్య చెప్పారట. దాంతో టీడీపీ హైకమాండ్‌ ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది.టీడీపీలో చేరినా.. ఫలానా చోట టికెట్ కావాలని కండీషన్‌ పెట్టొద్దని రావెలకు సమాచారం వెళ్లిందట. ఆ కబురు రుచించక టీడీపీలో జాయినింగ్‌ను దాట వేశారని ప్రత్తిపాడులో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మూడు పార్టీలు మారిన రావెల..టీడీపీలోకి వెళ్లినా టికెట్‌ గ్యారెంటీ లేకపోతే ఎలా అనే సంశయంలో పడ్డారట. అందుకే మౌనంగా ఉన్నారట. ప్రత్తిపాడు ఎమ్మెల్యే సుచరిత కుటుంబంలో ఒకరు బాపట్ల ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఆ విషయం తెలిసి రావెల తన ప్లాన్‌ మార్చుకున్నారని చెబుతున్నారు. ఎన్నికలకు దగ్గరకు వచ్చాక వ్యూహాలకు పదును పెట్టాలని చూస్తున్నారట.ప్రత్తిపాడులో రావెల రాజకీయ కథ ముగిసినట్టేనని స్థానికంగా మరో చర్చ నడుస్తోంది. జిల్లాలోని మరో నియోజకవర్గం నుంచి ఆయన అదృష్టం పరీక్షించుకునే అవకాశం ఉందని సమాచారం. అయితే ఆ నియోజకవర్గం ఏంటన్నది.. ఏ పార్టీలోకి వెళ్లి పోటీ చేస్తారన్నది బయట పెట్టడం లేదట. మొత్తంగా మెరుపు వేగంతో రాజకీయాల్లోకి వచ్చి.. అంతే వేగంతో పొలిటికల్‌ స్క్రీన్‌ పైనుంచి తెరమరుగయ్యారు. మరి.. కొత్త ఆలోచనలు మాజీ మంత్రికి వర్కవుట్ అవుతాయో లేదో చూడాలి.

 

Post Midle

Tags: Ravela.. Velavela

Post Midle