Natyam ad

రావి మొక్క నాటిన భద్రత దళ సభ్యుడు

నెక్కొండ ముచ్చట్లు:

 

మండల కేంద్రంలోని అప్పల్ రావు పేట గ్రామంలో పోచమ్మ తల్లి దేవాలయం ఆవరణలో గుండ్రపల్లి గ్రామ నివాసి గ్రీన్ ఇండియా చాలెంజ్ అవార్డు గ్రహీత వన ప్రేమికుడు స్థానిక గోపాలమిత్ర నల్లగొండ సమ్మయ్య ఆధ్వర్యంలో శుక్రవారం సరిహద్దు భద్రతా దళ దినోత్సవం సందర్భంగా అప్పల్ రావుపేట గ్రామనికి చెందిన ఆర్మీ జవాన్ కన్నెబోయిన కుమారస్వామి చేతుల మీదుగా “రావి మొక్క” నాటరు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సమ్మయ్య మాట్లాడుతూ మాతృభూమి రక్షణ కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి సరిహద్దులో పహారా సైనికులు అందరికీ పాదాభివందనాలు తెలిపారు.అనంతరం ఆర్మీ జవాన్ కుమారు మాట్లాడుతూ వృత్తి గోపాల మిత్రగా పశువులను బాగోగులు చూడడం. ప్రవృత్తి వన ప్రేమికుడిగా పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతూ మొక్కలు నాటడం సంరక్షణ చేసి నీళ్లు పోసి మానవాళి జీవకోటి ప్రాణులకు కాలుష్యం నివారించడానికి చెట్లను పెంచడం దేశ సరిహద్దు రక్షణలో ఆర్మీ పోరాడుతుంటే  చెట్లను పెంచి మానవాళి మనుగడకు మూలాధారమైన విధంగా సామాజిక సేవ మహా అద్భుతమని సమ్మయ్యని అభినందించారు.

 

Tags: Ravi is a member of the security force who planted the plant

Post Midle
Post Midle