‘రావాలి జగన్‌.. కావాలి జగన్‌’ 

'Ravive Jagan .. Kaviye Jagan'
Date:17/09/2018
విజయవాడ ముచ్చట్లు:
ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఏపీలో దూకుడు పెంచింది వైఎస్సార్‌సీపీ. ప్రజలకు మరింత చెరువై.. పార్టీని బలోపేతం చేసేందుకు సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. నవరత్నాలను ప్రజలకు చేరవేస్తూ.. వారికి దగ్గరయ్యేందుకు ‘రావాలి జగన్‌.. కావాలి జగన్‌’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం సోమవారం ప్రారంభంకాగా.. బూత్ స్థాయి కార్యకర్త నుంచి నియోజకవర్గ సమన్వయకర్త వరకు ‘రావాలి జగన్‌.. కావాలి జగన్‌’ నినాదంతో ముందుకు సాగుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఈ కార్యక్రమం ప్రారంభమయ్యింది. పార్టీ సమన్వయకర్తలు, నేతలు, కార్యకర్తలు ప్రజలతో మమేకం అవుతున్నారు.
ప్రతి రోజూ కనీసం రెండు పోలింగ్‌ బూత్‌ల పరిధిలోని ఇళ్లకు వెళ్లి.. టీడీపీ ప్రభుత్వ అవినీతి, అక్రమాలను వివరిస్తారు. వైఎస్సార్‌సీపీ లక్ష్యాలను వివరిస్తూ.. నవరత్నాల వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తారు. నెల రోజుల్లో 50 పోలింగ్‌ బూత్‌ల పరిధిలో గల కుటుంబాల్లోని వ్యక్తులందర్నీ కలుస్తారు. కార్యక్రమంలో భాగంగా.. ఎక్కడైనా ఇంకా బూత్‌ కమిటీల నియామకాలకు జరగకపోతే వాటిని వారం రోజుల్లో పూర్తి చేయాలని విశాఖలో జరిగిన పార్టీ సమావేశంలో అధ్యక్షుడు జగన్ సూచించారు.
నియామకాలు జరగకపోతే.. పార్టీ కేంద్ర కమిటీయే సమర్థులను గుర్తించి నియామకాలు చేపట్టాలని నిర్ణయించారు. బూత్‌ కమిటీల నిర్వహణ తీరును పరిశీలించేందుకు మండల, జిల్లా, రీజినల్‌ స్థాయిల్లో ప్రత్యేకంగా బాధ్యులను నియమిస్తారు. వారు గుర్తించిన విషయాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తారు.
Tags: ‘Ravive Jagan .. Kaviye Jagan’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *