తిరుపతి లో పెద్దిరెడ్డి ని కలిసిన పెద్దపంజాణి మండల నాయకులు

Rayalappetta leaders meet Peddireddy

Rayalappetta leaders meet Peddireddy

Date:15/09/2018

తిరుపతి ముచ్చట్లు:

పుంగనూరు ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిపెద్దపంజాణి మండల నాయకులు తిరుపతి కి చేరుకొని ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ పెద్దపంజాణి తో పాటు అన్ని మండలాల్లో
పలమనేరు నియోజక వర్గం లోని రాజకీయ పరిస్థితులపై ఆరా తీశారు.వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ సమిష్టి గా పనిచేసి వైస్ జగన్ మోహన్ రెడ్డి ని రాబోయే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో సీఎంగా చేయాలనీ సూచించారు. రాయలపేట కు చెందిన వైకాపా జిల్లా కార్యదర్శి కె.చంద్రశేఖర్ రెడ్డి  ఆధ్వర్యంలో 23 పంచాయతీలకు చెందిన నాయకులుపెద్దిరెడ్డి ని కలిశారు . ఇందులో రాష్ట్ర కార్యదర్శి వాసన్న,   పుంగనూరు మాజీ ఎమ్మెల్యే తనయుడు,మాజీ సర్పంచ్ వెంకటరత్నం, మాజీ వైస్ ఎంపిపి రామకృష్ణారెడ్డి,  జిల్లా ప్రదనకార్యదర్శి యరబల్లి శ్రీనివాసులు, ప్రకాష్ రెడ్డి, శంకర్, అమర్నాథ్, నరసింహులు, మైనార్టీ జిల్లా కార్యదర్శి మాబు సాహెబ్, బాబు, నారాయణ, చలపతి, కమ్మపాళ్యం చంద్రన్న, పెనుగోళకల బాల ,ఇంతియాజ్, జిల్లా కార్యదర్శి మాకయ్య,పెద్దిరెడ్డి అభిమానులు, సుమారు వంద మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

125 గజాలలోపు ఉంటే రిజిస్ట్రేషన్ ఫ్రీ

Tags:Rayalappetta leaders meet Peddireddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *