కడప ఆర్జెడి ప్రతాపరెడ్డి ని కలసిన రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ డైరెక్టర్ చంద్రమోహన్ రెడ్డి
మదనపల్లి ముచ్చట్లు :
మదనపల్లి పట్టణానికి విచ్చేసిన ప్రస్తుత రాష్ట్ర S C E R T డైరెక్టర్ ఉన్న పాఠశాల విద్యాశాఖ కడప ఆర్జెడి (ఫుల్ అడిషనల్ చార్జ్) గా నియమితులైన బండ్లపల్లి ప్రతాపరెడ్డి ని కలసి ప్రైవేటు పాఠశాలలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వారి దృష్టికి తీసుకొచ్చారు . అందులో ప్రధానంగా ప్రైవేటు పాఠశాలల గుర్తింపును పది సంవత్సరములకు ఒక మారు రెన్యువల్ చేసుకునే విధంగా చూడాలనికోరారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందిస్తూ ప్రభుత్వం దృష్టికి వెంటనే తీసుకెళ్లి వీలైనంత త్వరలో రెన్యువల్ను పది సంవత్సరములకు ఒకసారి చేసుకునే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ డైరెక్టర్ C. చంద్రమోహన్ రెడ్డి, మదనపల్లి విజయభారతి విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఎన్ సేతు, డైరెక్టర్ ని కలిశారు.

Tags; Rayalaseema Children’s Academy Director Chandramohan Reddy met Kadapa RJD Prathapareddy
