Natyam ad

రాయలసీమ ద్రోహి చంద్రబాబే

– వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి కృష్ణమూర్తి

 

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

రాయలసీమకు మనుగడ లేకుండ చేసింది చంద్రబాబేనని , సీమ అభివృద్ధి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌.రాజశే ఖర్‌రెడ్డి , ఆయన తనయుడు వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రాజెక్టులు తీసుకొచ్చి ఎంతో అభివృద్ధి చేశారని వై ఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి బైరెడ్డిపల్లి కృష్ణమూర్తి దుయ్యబట్టారు. గురువారం పట్టణంలోని హైస్కూల్‌వీధి, బ్రాహ్మణవీధి, నాగపాళ్యెం ప్రాంతాలలో మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్‌ అమ్ముతో కలసి ర్యాలీ, ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ జిందాబాద్‌….పెద్దిరెడ్డి జిందాబాద్‌…మిధున్‌రెడ్డి జిందాబాద్‌ అంటు నినాదాలు చేసి , ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేశారు. రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుపై వేసి , ఎమ్మెల్యే అభ్యర్థి డాక్డర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిలను గెలిపించాలని కోరారు.

 

 

అలాగే రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, సీమ జిల్లాల మైనార్టీ సెల్‌ ఇన్‌చార్జ్ ఫకద్ధిన్‌షరీఫ్‌, మైనార్టీ నాయకులు మహబూబ్‌బాషా కలసి రహమత్‌ నగర్‌లో ప్రచారాలు చేశారు. కృష్ణమూర్తి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పలమనేరు సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. రాయలసీమకు హంద్రీనీవా కాలువ, గండికోట రిజర్వాయరు, కుప్పంకు హంద్రీనీవా నీటిని విడుదల చేయడం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జరిగిందన్నారు. 2014 నుంచి మాయమాటలతో ప్రజలను మోసగించిన చంద్రబాబు కొత్త ఎత్తులతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాయలసీమకు ద్రోహం చేశారని పేర్కొనడం హాస్యాస్పదమన్నారు. ఇలాంటి మాటలు మానుకోకపోతే ప్రజలు త్వరలోనే తగిన గుణపాఠం నేర్పుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు పూలత్యాగరాజు, జెపి.యాదవ్‌, కాళిదాసు, మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అమరేంద్ర, బోయకొండ డైరెక్టర్‌ రాజేష్‌, నాయకులు మురుగప్ప, రామకృష్ణ, రమణ, ప్రభు, రషీద, అజీజ్‌, ఇర్ఫాన్‌, జావీద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags: Rayalaseema traitor Chandrababe

Post Midle