Date:16/01/2021
అమరావతి ముచ్చట్లు:
పట్టణంలో ఉన్న రావుస్ డిగ్రీ కళాశాల యజమాన్యం ప్రభుత్వ నిబంధనలు విరుద్ధంగా కళాశాలను నడుపుతున్నారు తక్షణమే చర్యలు తీసుకొని కొత్తగా ఆన్లైన్ అడ్మిషన్లు చేసుకోకుండా బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి అని యూనివర్సిటీ అధికారులకు ఎన్ని సార్లు విన్నవించిన ఫలితం లేదు శనివారం వైస్సార్ కూడలి నందు రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్ (విసి)ఆనంద్ రావు దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది అని విద్యార్థి ,యువజన సంఘాల నాయకులు రాజేశ్, ఓంకార్,ఉదయ్,శేఖర్, రాజీవ్,సురేష్ ,అజిత్ తెలిపారు అనంతరం మాట్లాడుతూ ఈ కళాశాల ప్రభుత్వం నుండి అనుమతి తెచ్చుకొని ఇప్పటికి 10 సంవత్సరాలు అవుతున్న అద్దె భవనంలో నడుపుతున్నారు అది కామర్షల్ కంప్లెక్స్ లో ఇరుక్కుఇరుకున గదులలో జైలు లగా ఉన్నది విద్యార్థులకు బాత్రూములు కూడా లేవు సైన్సు విద్యార్థులకు అయితే ల్యాబ్ లు చిన్న సముదాయంలో ఏర్పాటు చేశారు కళాశాలకు ఆటస్థలం,పార్కింగ్ స్థలం లేవు కళాశాల భవనం పక్కన అత్యంత ప్రమాదకరమైన విద్యత్ వైర్లు ఉన్నాయి ఏదైనా అగ్నిప్రమాదం జరిగితే విద్యార్థులు బయటకి ఎలా వేళల్లో కూడా దారి లేదు. ఈ కళాశాలకు ఫైర్ అనుమతులు కూడా లేవు ప్రభుత్వం నుండి ఫీజు రేంబెర్స్మెంట్ క్రింద సంవత్సరానికి 3 కోట్ల రూపాయలు కళాశాల యాజమాన్యం తీసుకొంటూ విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదు కేవలం కళాశాలను ఒక వ్యాపారం లాగా నడుపుతున్నారు కానీ విద్యార్థుల భవిష్యత్ గూర్చి ఆలోచించడం లేదు అన్నారు .ఈ విషయం పై యూనివర్సిటీ అధికారులకు అనేక సార్లు ఫిర్యాదు చేసిన దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. కాబట్టి ఇలాగే అధికారులు ప్రవర్తిస్తే భవిష్యత్తు లో నిరాహారదీక్షలు చేస్తాం అని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నాయకులు ,చిన్న, అనీల్ ,శివ,విశ్వనాథ్, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.
పుంగనూరు యువజన సంఘ నాయకుడు చెంగారెడ్డి జన్మదిన వేడుకలు
Tags:Rayalaseema University Vice Chancellor (VC) effigy cremated