తెలంగాణలో రజాకర్ల పాలన : పోన్నాల

Razakars rule in Telangana: Pannala

Razakars rule in Telangana: Pannala

Date:17/09/2018
జనగామ ముచ్చట్లు:
తెలంగాణ విమోచన దినోత్సవన్నీ పురస్కరించుకుని  మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య సిద్దిపేట జిల్లా జనగామ నియోజకవర్గం మద్దూరు మండలంలోని వీర బైరన్ పల్లి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు అర్పించిన అమరవీరుల స్థూపనికి నివాళులు అర్పించారు. గత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్మించిన అమరవీరుల స్థూపంపై ఉన్న శిలాఫలకం ధ్వసం చేయడం చూసి ఆగ్రహానికి లోన్నాయారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ కోసం  ఉద్యమం చేసినప్పుడు ఈ కేసీఆర్ ఎక్కడ ఉన్నాడని, ఉద్యమ కారుల పునాదుల మీద ప్రత్యేక రాష్ట్రం గా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం, నేడు అమర వీరులను మరచి కనీసం విమోచన దినం రోజు నివాళులు అర్పించాటానికి కూడా సమయం లేదా అని మండిపడ్డారు. అంతేకాదు నేడు తెలంగాణా లో రజాకార్ల ను మరిపించేలా పాలన సాగుతోందని, ఆనాడు రజాకార్ల తోటి వీరోచితంగా పోరాడిన వీర బైరన్ పల్లి కి కేసీఆర్ ఎం చేసారని దుయ్యబట్టారు.అంతేకాక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమ కారుల పైన ఉన్న కేసులను ఇప్పటికి రద్దు చేయలేదని ప్రశ్నించారు.
ప్రజాస్వామ్య ముసుగులో నియంతల పాలన సాగిస్తున్నారు. దొర ఆరోజు గడిలా పాలనను మరిపించేలా ఈరోజు మీ కుటుంబ పాలన సాగుతోందని,  మిమ్మల్ని కూడా ప్రజలే తరిమికొడతారని, వీర బైరన్ పల్లి సమర యోధులరా మరో సారి మన తెలంగాణ తల్లిని బంధించిన వారిని తరిమికొట్టే రోజు వచ్చిందని అందరూ సిద్దాంగా ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన 118 మంది యోధులకు సన్మానం చేసి వారి సేవలను కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి పింఛన్లు కల్పిస్తామని తెలిపారు.
Tags:Razakars rule in Telangana: Pannala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *