ఆదమరిస్తే….. అంతే సంగతులు  భారీ వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్న రహదారులు  పట్టించుకోని ఆర్ అండ్ బి అధికారులు

 

Date:5/08/2020

తుగ్గలి ముచ్చట్లు:

గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు ఉప్పొంగి రహదారులను పూర్తిగా దెబ్బ తీశాయిబి.పలు చోట్ల భారీ వర్షాలకు ప్రధాన రహదారులన్నీ కోతకు గురి అయ్యాయి.మండల పరిధిలోని రాతన గ్రామంలో గల గుత్తి-ఆదోని ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతింది.అదేవిధంగా తుగ్గలి నుండి  గుంతకల్ వైపు వెళ్ళు ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతింది. ప్రధాన రహదారులన్నీ పూర్తిగా దెబ్బతిన్న ఆర్అండ్బి అధికారులు తొంగిచూడడం లేదు.బ్రిడ్జిల వద్ద నీరు ఉదృతంగా ప్రవహించి రోడ్లను కుంగదీసాయి.ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ రోడ్లలో ఎప్పుడు ఏ అపాయం ఏర్పడుతుందో అని వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు.కోతకు గురైన రోడ్ల వద్ద రైతులు రాళ్లను ఉంచి అపాయాన్ని తెలియజేస్తున్నారు.

 

రైతులు చీకటిలో ఎద్దుల బండి ద్వారా పొలాలకు వెళ్తుంటారు,వెళ్లే సమయంలో రహదారులు కుంగిపోవడం ద్వారా పశువులకు,రైతులకు ఎటువంటి ప్రమాదం వాటిల్లుతుందో అని రైతులు భయాందోళనకు గురవుతున్నారు.ఇంత జరుగుతున్నా ఆర్అండ్బి అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. విచిత్రమేమిటంటే మూడు నెలలకు ఒకసారి మండల కేంద్రమైన తుగ్గలిలో ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించే సర్వసభ్య సమావేశానికి కూడా వారు హాజరుకావడం లేదు.అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ఉంటే జరిగే ప్రమాదాలకు బాధ్యులు ఎవరని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు.చివరికి ఆర్అండ్బి అధికారులు రోడ్డుకు ఇరువైపులా సూచిక బోర్డులను కూడా ఏర్పాటు చేయడం లేదు.ఇప్పటికైనా ఆర్అండ్బీ అధికారులు స్పందించి మండల పరిధిలో గల రోడ్డు సమస్యలను పరిష్కరించాలని పలువురు తెలియజేస్తున్నారు.ఈ సమస్యలను పట్టించుకోని ఎడల స్థానిక ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి దృష్టికి తీసుకెళ్తామని గ్రామస్తులు,రైతులు తెలియజేస్తున్నారు.

 

ట్రాక్టర్ పట్టివేత

 

Tags:R&B officials do not care about roads that are completely damaged by heavy rains

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *