పుంగనూరులో ఆర్‌బికెలు, సచివాలయాలు ప్రారంభోత్సవానికి సిద్దం చేయాలి -వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

 

మండలంలో జరుగుతున్న ఆర్‌బికెలు, సచివాలయాలు, వెల్‌నెస్‌ సెంటర్లు, మిల్క్ చిల్లింగ్‌ సెంటర్లు ప్రారంభోత్సవానికి సిద్దం చేయాలని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి తెలిపారు. సోమవారం మండల అభివృద్ధి కమిటి చైర్మన్‌ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డితో కలసి వనమలదిన్నె, బసివినాయునిపల్లె, మాగాండ్లపల్లె, మంగళం, ఏటవాకిలి, బండ్లపల్లె, ఏతూరు, నెక్కుంది, మర్రిమాకులపల్లె పంచాయతీలలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ పుంగనూరులో జరుగుతున్న పనులను మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించనున్నారని , వీటిని సత్వరమే పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పిఏ మునితుకారాం, మాజీ జెడ్పిటిసి వెంకటరెడ్డి యాదవ్‌, పార్టీ నాయకులు సుబ్రమణ్యంరెడ్డి, చెంగారెడ్డి, చంద్రారెడ్డి యాదవ్‌, రాజశేఖర్‌రెడ్డి, ఈశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags: RBKs and secretariats should be ready for inauguration in Punganur – YSRCP Secretary of State Peddireddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *