పార్టు టైం ఇన్స్ ట్రక్టర్స్ ,టిచర్లను రీ  ఎంగేజ్ చేస్తూ జూన్  నుండి వేతనాలు ఇప్పించండి

-యం.యల్.సి. పల్లా రాజేశ్వర్ రెడ్డిని కలిసిన టాకా,ఏసిటిఏ ప్రతినిధుల బృందం

Date:18/01/2021

హైదరాబాద్  ముచ్చట్లు:

తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర శిక్ష అయిన విద్యా శాఖ ఆద్వర్యంలో ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోననత పాఠశాలలో పని చేస్తున్న పార్టు టైం ఇన్స్ ట్రక్టర్స్ (పి.టి.ఐ) టిచర్లను రీ  ఎంగేజ్ చేస్తూ జూన్  నుండి వేతనాలు ఇప్పించాలని తెలంగాణ ఆర్ట్, క్రాప్ట్, పి.ఇ.టి. అసోషియేషన్ (టాకా),ఏసిటిఏ ప్రతినిధుల బృందం  విజ్ఞప్తి చేసింది.ఈ మేరకు యం.యల్.సి. పల్లా రాజేశ్వర్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేసారు. మేము పేరుకే పార్ట్ టైం, కాని పుల్ టైం వర్క్ చేస్తూన్నామని పేర్కొన్నారు.పక్క రాష్ట్రం అయిన అంధ్రప్రదేశ్ లో పి.టి.ఐ లకు 12 నెలల వేతనం ఇస్తున్నారు. మన ప్రభుత్వం పి.టిఐలకు ఇచ్చే రూ.9000 వేల రూపాయిలు ఇస్తున్నారని ఇవి కనీస అవసరాలు తీరటం లేదని పేర్కొన్నారు.. మేము ఈ ఉద్యోగాన్నే సమ్ముకొని ఉన్నామని, నిత్యవసర సరుకుల రేట్లు విపరితంగా పెరిగానాయి, ఆర్ధికంగా చాలా ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేసారు..ఈ కరోన విపత్కర పరిస్తితిలో మాకు ఎటువంటి ఆర్ధిక సహయం అందలేదు. మే నెల నుండి ఇంటి అద్దెలు,  నిత్యావసరాలకు అప్పులు తెచ్చుకొని ఇప్పటి వరకు మా కుటుంబాలను నెట్టుకొచ్చామని పేర్కొన్నారు.. బయటి పని లేక చివరకు మా జీవితాలు అత్మహత్యల వరకు దారి తీసే పరిస్థితి వచ్చింది.కనీసం మానవత్వం తోనైనా మా కుటుంబాాలను రోడ్డున పడకుండా ఆదుకోవాలని కోరారు. పల్లాను కలిసిన వారిలో ‘టాకా’ అద్యక్షులు టి.కేశవ్ కుమార్,ప్రదాన కార్యదర్శి మదార్ సైదులు,ఏసిటిఏ నేతలు కృష్ణమాచారి,రామేష్,లక్ష్మి,సత్యానంద్,శ్యాంరావు,శ్రీధర్చారి,ఉపేందర్,తిరుపతి,లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

అయోధ్యలో రామాలయ నిర్మాణానికిఅర్వపల్లి కోటేశ్వర్రావు సత్యవతి దంపతులు విరాళo

Tags:Re-engage part-time instructors and teachers and pay salaries from June

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *