ఇష్టపడి చదవండి

Read and like

Read and like

Date:20/09/2018
విజయవాడ ముచ్చట్లు :
విజయవాడ లోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో  గురువారం నిర్వహిస్తున్న  జ్ఞానభేరి కి  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హజరయ్యారు. తరువాత సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్, మంత్రులు ఘంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, జడ్పి ఛైర్పర్ పర్సన్ గద్దె అనురాధ, ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్య, ఎమ్మెల్సీలు ఎఎస్ రామకృష్ణ, బచ్చుల అర్జునుడు, ఉన్నతాధికారులు ఆదిత్యనాద్ దాస్ , ఉదయలక్ష్మి, కృష్ణా యూనివర్సిటీ విసి రామకృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రపంచంలో ఏ దేశానికి లేని శక్తి మనకు ఉంది. అమెరికా కంటే ఎక్కువ మంది ఇంగ్లీష్ మాట్లాడేవారు మన దేశంలో ఎక్కువ. ఇండియాలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఆంద్రప్రదేశ్ ను ఉంచుతాను. భావితరాల కోసం నేను ఎన్డీయే లో భాగస్వామి అయ్యాను. నరేంద్రమోదీ నాకన్నా సీనియర్ కాదు. నాకన్నా వెనుక ఆయన రాజకీయాలోకి వచ్చారు. కేంద్రం నమ్మకద్రోహం చేసింది. డబుల్ డిజిట్ గ్రోత్ సాధించిన ఏకైక రాష్ట్రం ఎపి.
ఈ విద్యార్థులు పెరిగేకొద్దీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మీకోక కారియర్ బిలీడప్ చేస్తానని అన్నారు. కష్టపడి కాదు. ఇష్టపడి చదవండి. చదువు అదే వస్తుంది. కొన్ని కాలేజీలు 24 గంటలు రుద్దుతున్నారు. అమరావతి ప్రపంచంలోనే బెస్ట్ సిటీ అవ్వడం ఎంతో దూరంలో లేదు. ఎవరైనా ఆరోగ్యంగా జీవించాలి అనుకుంటే అమరావతికి వస్తారు. రాష్ట్రంలో నడులన్ని అనుసంధానం చేసి రెండు కోట్లు ఎకరాలకు నీరు అందించాలనే నా సంకల్పమని అన్నారు.
Tags:Read and like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *