పీడీ ఖాతాలపై బహిరంగ చర్చకు సిద్దమా? టి.డి. జనార్ధన్

 Date:11/08/2018
విజయవాడ ముచ్చట్లు:
 రాష్ట్రంలో జి.వి.ఎల్ నరసింహారావు రాజకీయ లబ్ది కోసం వెంపర్లాడుతున్నారు. ఆయన రాజ్యసభ ఎంపీ అయినప్పటి నుంచి రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనాలను చేకూర్చారో చెప్పాలి. పీడీ ఖాతాలాపై విష ప్రచారానికే జీవీఎల్ తెరతీశారు. మీ వాధనను కేంద్ర ఆర్ధిక మంత్రి సమర్ధిస్తారా?  పీడీ ఖాతాల్లో ప్రతి లావాదేవిని ఆన్లైన్లో ఎక్కడైనా చూడవచ్చని తెలుగు దేశం ఎమ్మెల్సీ  టీడీ జనార్ధన్ అన్నారు.  పీడీ ఖాతాల విషయంలో కేంద్రాన్ని లెక్కలు చూపించమని అడిగే దమ్ము జీవీఎల్‌కు ఉందా? కాగ్ లేవనెత్తిన ప్రతి అంశానికీ ఏపీ ప్రభుత్వం సమాధానం ఇవ్వటం జరిగింది. ప్రభుత్వం ఇచ్చిన సమాధానంపై ప్రజాపద్దుల సంఘం కూడా సంతృప్తి వ్యక్తిం చేసిన విషయం నీకు తెలియదా? రాష్ట్రానికి నిధులు రాకుండా చేసేందుకే అసత్య ఆరోపణలు చేస్తున్న విషయం వాస్తవం కాదా?  కాగ్ నివేదికలో అవినీతి జరిగిందని ఎక్కడా చెప్పలేదు. కాగ్ నివేదికలపై చర్చ సిద్ధమా? గవర్నర్‌ను కూడా తప్పుదోవ పట్టించేందుకు కుట్రపన్నావ్. పీడీ ఖాతాల విషయంలో గవర్నర్‌కు లేఖ రాయడం ఎంత వరకు సమంజసం? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 266(2) ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పీడీ అకౌంట్లను నిర్వహిస్తాయని అయన అన్నారు.  పీడీ ఖాతాలు పెద్ద స్కాం అంటూ భారత రాజ్యాంగానే అవమానించే విధంగా జీవీఎల్ వ్యవహరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి 4 లక్షల కోట్లు పీడీ అకౌంట్ల ట్రాన్సాక్షన్స్ వున్నవి. కేంద్రంలో విద్యాసెస్కు సంబంధించి రూ.83 వేల కోట్లకు సరైన లెక్కలు లేవని కాగ్ ఎత్తిచూపింది. జి.వి.ఎల్ నరసింహారావుకు దీని మీద సీబీఐ ఎంక్వైరీ కోరే దమ్ముందా? రాష్ట్రానికి పరిశ్రమలు రాకూడదనే కుట్రలో భాగంగానే దుష్ప్రచారం చేస్తున్నారని అయన అన్నారు.  రాఫెల్లో అవినీతి జరిగిందని బీజేపీ నాయకులే చెప్పారు. ఎస్సార్ ఆయిల్, అమిత్‌షా కుమారుడు కుంభకోణం జరిగిందని కోడై కూస్తుంటే దానికి మీ సమాధానం?  నీరవ్‌మోడీ, లలిత్‌మోడీ, విజయ్మాల్యాల వేల కోట్లు అవినీతి చేసి బ్యాంకులకు టోకరా పెట్టి విదేశాలకు వెళ్లిపోవడానికి మీరు సహకరించారని పుకార్లు ఉన్నాయి వీటన్నింటికి మీరు సమాధానం చెప్పాల్సి ఉంది. నిందా ప్రచార దాడివల్ల ఆంధ్రుల్ని గెలవలేరని గ్రహించాలి. ఏపీ ప్రభుత్వం పీడీ అకౌంట్ నిర్వహించడం పెద్ద స్కాం, 2జీ కుంభకోణం అయితే, దేశంలోని అన్ని బీజేపీ ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం 2జీ కుంభకోణానికి పాల్పడినట్లా? జీవీఎల్ నరసింహారావు 5 కోట్ల ఆంధ్రులకు సమాధానం చెప్పాలని అయన అన్నారు.
Tags:Ready to open public discussion on Pdf accounts? DD Janardhan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *