రెడీ అవుతున్న యూనిఫామ్స్

Ready Uniforms

Ready Uniforms

Date:19/11/2018
సంగారెడ్డి ముచ్చట్లు:
సంగారెడ్డి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫామ్స్ రెడీ అవుతున్నాయి. అతి త్వరలోనే విద్యార్ధులందరికీ ఏకరూప దుస్తులు పంపిణీ చేయనున్నారు. సంగారెడ్డిలోనే కాక మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లా అంతటా 9, 10వ తరగతులు చదివే విద్యార్ధులకు యూనిఫామ్స్ త్వరలోనే అందించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు యూనిఫామ్ ఇస్తామని సర్కార్ గతంలోనే తేల్చిచెప్పింది.
అయితే అవి ఎనిమిదో తరగతి విద్యార్థుల వరకు మాత్రమే అందాయి. తొమ్మిది, పదో తరగతులకు సరఫరా చేయలేదు. దీంతో చిన్న తరగతుల్లో అందజేసిన దుస్తులనే ధరిస్తూ పాఠశాలకు వస్తున్నారు చాలా మంది విద్యార్థులు. మరికొంత మంది సొంతంగా కొనుగోలు చేసుకుని ఇబ్బందులు పడ్డారు. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం ఎట్టకేలకు 9, 10 తరగతులతో పాటు కస్తూర్బా, ఆదర్శ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కూడా యూనిఫామ్స్ అందజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే వస్త్రాన్ని సరఫరా చేసింది.
దీంతో జిల్లాల్లోని మండలాల్లో వీలునుబట్టి దుస్తులు కుట్టడానికి ఏజెన్సీలు చర్యలు తీసుకుంటున్నాయి. అందరికీ ఏకరూప దుస్తులు అందజేయాలనే నిర్ణయంతో వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ దుస్తులు ఆగస్టులోనే అందజేయాలని నిర్ణయించినా ఆలస్యంమైంది. ఏదైతేనేం నవంబర్ చివరి నాటికి విద్యార్ధులందరికీ యూనిఫామ్స్ ఇవ్వాలని అధికారులు నిర్ణయంచారు. ఒక్కో విద్యార్థికి రెండు జతలు అందించనున్నారు.
వీటి కుట్టు కూలికి ఒక్కో జతకు రూ.50 చొప్పున అందజేస్తున్నారు. విద్యార్ధులందరికీ యూనిఫామ్స్ అందించడానికి విద్యాశాఖ చర్యలు తీసుకోవడంతో పిల్లల తల్లితండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్ధి సంఘాల నేతలు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
Tags;Ready Uniforms

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *