రియల్ కన్యాదానం

Real Conan

Real Conan

 Date:25/04/2019
పాట్నా ముచ్చట్లు:
కన్యాదానం సినిమా గుర్తుందా.. ఆ మూవీ స్టోరీ అందరికీ తెలుసుగా. ఉపేంద్ర, రచన ప్రేమించుకోవడం.. అనుకోని పరిస్థితుల్లో రచన, శ్రీకాంత్ పెళ్లి జరగడం.. శ్రీకాంత్‌కు రచన ప్రేమ వ్యవహారం గురించి తెలియడం.. ఆ తర్వాత రచనను ఉపేంద్రకు ఇచ్చి శ్రీకాంత్ పెళ్లి చేస్తాడు. ఈ సినిమాలో రచన ప్రేమను అర్ధం చేసుకున్న శ్రీకాంత్ ఉపేంద్రతో పెళ్లి చేసి తన పెద్ద మనసు చాటుకుంటాడు. ఇదంతా రీల్ స్టోరీ.. ఇదే స్టోరీ రియల్ లైఫ్‌లో బీహార్‌లో కూడా జరిగింది. జాతీయ మీడియా సంస్థల కథనం ప్రకారం.. బీహార్‌లోని భాగల్పూర్‌‌ సమీపంలోని సాలెపూర్‌కు చెందిన ఓ వ్యక్తికి వివాహమయ్యింది. ఈ దంపతులకు ఓ బాబు కూడా ఉన్నాడు. భర్త ఓ కేసులో అరెస్ట్ కావడంతో జైలు శిక్ష విధించారు. తర్వాత భార్య కొడుకుతో అద్దె ఇంట్లోనే నివాసం ఉంది. ఈ క్రమంలో ఆమె ఇంటి యజమాని కుమారుడితో పరిచయం పెంచుకోగా.. ఇద్దరి మధ్య ప్రేమ ఏర్పడింది. ఈలోపు భర్త జైలు నుంచి విడుదలయ్యాడు. కొద్దిరోజుల తర్వాత తన భార్య యజమాని కుమారుడితో ప్రేమలో ఉందని తెలుసుకున్నాడు. ఆమె ప్రేమను అర్ధం చేసుకొని ఆ యువకుడికి ఇచ్చి వివాహం చేశాడు. అంతేకాదు రెండున్నరేళ్ల బాలుడ్ని కూడా వారికే అప్పగించాడు. తానే పెళ్లి పెద్దగా మారి దగ్గరుండి వివాహాన్ని జరిపించాడు.
Tags:Real Conan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *