ఖమ్మంలో రియల్ మాఫియా
ఖమ్మం ముచ్చట్లు:
9 ఎకరాల్లో వెంచర్ కోసం దరఖాస్తు చేసుకుని ఏకంగా 14 ఎకరాల్లో వెంచర్ ఏర్పాటు జరుగుతోంది. ఖమ్మంరూరల్ మండలం ముత్తూగూడెం పంచాయతీ పరిధిలో పెద్ద మొత్తంలో వెంచర్ ప్లాన్చేశారు. కేవలం మట్టిని నింపి సుడాకు కానీ, టీఎస్బీపాస్‌కు కానీ దరఖాస్తు చేయకముందే 14 ఎకరాలకు పైగా వెంచర్నిర్మాణం కోసం బ్రోచర్రిలీజ్ చేసి అమ్మకాలు పూర్తి చేసి జేబులు నింపుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వెంచర్వేయడంతో ప్లాట్ కొన్న వారికి భవిష్యత్తులో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. సదురు పంచాయతీ కార్యాలయంలో మాత్రం 9 ఎకరాలకు దరఖాస్తు చేసుకున్నట్లు అసంపూర్తిగా ఉన్న ధ్రువపత్రాలు సమర్పించాడు. కానీ వెంచర్ మాత్రం 14 ఎకరాలకు పైగా నిర్మాణం చేసేందకుకు మట్టిని నింపి ఓ అందమైన మ్యాప్‌ను కూడా విడుదల చేసి బహిరంగ మార్కెట్లో విక్రయాలు జరుపుతున్నాడు.కొత్తగా వచ్చిన టీఎస్బీపాస్‌లో దరఖాస్తు చేసుకుని అన్ని శాఖల నుంచి సంబంధిత ఎన్‌వోసీలు సమర్పించి, టీఎల్‌పీ వచ్చిన తరువాతనే వెంచర్ డెవలప్ చేయాలని అలా కాకుండా తన ఇష్టం వచ్చినట్లుగా మ్యాప్‌ను తయారు చేసి విక్రయాలు జరపుతూ వినియోగాదారుల కంట్లో ‘కారం’ కొడుతున్నాడు. సదురు వెంచర్పక్కన సాగర్ కాలువకు సంబంధించిన వాగు ఏదులాపురం చెరువులోకి వెళ్తుండటం గమనార్హం. ఈ చెరువు దాదాపు 200 ఎకరాలకు పైగా ఉండటంతో పాటు చెరువు కింద సాగుభూమి కూడా భారీగానే ఉంది.ఈ వెంచర్ నిర్వాహకుడి వాగు అక్రమణ వలన చెరువులోకి వెళ్లాల్సిన వరద నీరు, వెళ్లకుండా చెరువు కింద ఉన్న రైతుల భవిష్యత్తు ప్రశ్నార్తకంగా మారే అవకాశం ఉంది. నిబంధనల ప్రకారం ఎన్‌వోసీ తీసుకుని వాగు అంచు నుంచి దాదాపు 30 అడుగుల బఫర్ జోన్ కింద వదలేసిన తరువాతనే నిర్మాణం చేసుకోవాలి. కానీ ఇక్కడ ఎటువంటి ఎన్‌ఓసీలకు కూడా దరఖాస్తు చేసిన దాఖలాలు లేవు. అది కాకుండా హైటెన్షన్విద్యత్ లైన్కూడా ఈ వెంచర్లో నుంచి వెళ్తోంది. ఈ లైన్ కింద ఎటువంటి నిర్మాణాలు జరపకూడదు. భవిష్యత్తులో జరిగే ప్రమాదాలతో ప్రజల ప్రాణాలు గాలిలో కలిసే అవకాశం ఉంది.
విద్యత్శాఖ నుంచి ఎన్‌వోసీ తీసుకోని నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. కాగా ఎలాంటి అనుమతులు లేకుండానే విక్రయాలు జరపడంతో కొనుగోలు దారులకు నష్టం కలగనుంది. వెంచర్ యజమాని మాత్రం తనకు రూల్స్ జాన్తానయ్ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. వెంచర్‌లు వేయడం తనకు కొత్త కాదని.. అధికారులు వస్తుంటారు.. వాళ్లకు కావాల్సినవి ఇస్తాం అని ధీమాతో ఉన్నారు. అంతే మిగతా పనులు వాటంతటే అవే జరుగుతుంటాయి. ఎవరు ఏమి రాసుకున్న భయపడేదిలేదు అని చెప్పడం గమనార్హం. గతంలో జిల్లా కలెక్టర్పాత వెంచర్‌లో గ్రీన్ బెల్టు తీయాలని ఆదేశించి పలు వెంచర్లలో అధికారులు గ్రీన్బెల్ట్తీయించారు. కానీ ఏదులాపురం పంచాయతీ పరిధిలో చేసిన వెంచర్‌లో మాత్రం ఎటువంటి గ్రీన్‌బెల్ట్‌తీయలేదు. దాంట్లో అక్రమ నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి. పంచాయతీ నుంచి పర్మిషన్లు కూడా వస్తున్నాయి. మిగిలిన ప్లాట్లను కూడా గిఫ్ట్డీడ్చేస్తున్నట్లు సమాచారం. సుడా, ఉన్నతాధికారులకు ఎంతోకొంత ముట్టజెప్పి తన పని కానిచ్చేస్తున్నాడుఅక్రమ వెంచర్ నిర్మాణం చేయడంతో పాటు ప్రభుత్వానికి చెల్లించాల్సిన చలాన్లు చెల్లించకుండా అధికారులనే బురిడి వెంచర్ నిర్వాహకుడు బురిడి కొట్టిస్తున్నాడు. వేల ట్రిప్పుల కొద్ది మట్టిని అక్రమంగా తరలించి, సంబంధిత శాఖకు ఎటువంటి ఫీజును కూడా చెల్లించకపోవడంతో ప్రభుత్వాధాయానికి గండి పడుతోంది. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే వెంచర్ కోసం పెద్ద మొత్తం మట్టి తరలించడం చర్చనీయాంశమైంది. దాదాపు రూ.10లక్షలకు పైగా మైనింగ్ శాఖకు చలాన్ రూపంలో ఎగనామం పెట్టాడు. సరైన అనుమతులు లేని వెంచర్ లో ప్లాట్ లు కొనే వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.

Tags: Real Mafia in Khammam
