స్వర్ణరథంపై శ్రీ పద్మావతి అమ్మవారి సాక్షాత్కారం

తిరుపతి  ముచ్చట్లు:

 

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి వసంతోత్సవాల్లో భాగంగా రెండవరోజు గురువారం ఉదయం స్వర్ణరథంపై ఆశీనులై భక్తులను కటాక్షించారు. ఆలయంలో ఉదయం వైదిక కార్యక్రమాల అనంతరం శ్రీపద్మావతి అమ్మవారి ఉత్సవ మూర్తిని అర్చకులు స్వర్ణరథంపై ఆశీనురాలిని చేశారు.మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తన్మయత్వంతో నాలుగుమాడ వీధుల్లో రథాన్ని లాగారు. కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.స్వర్ణరథోత్స‌వంలో సిఈ నాగేశ్వరరావు, ఎస్ ఇ-2 జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో గోవింద రాజన్, ఆల‌య అర్చకులు బాబుస్వామి, సూప‌రింటెండెంట్  శేష‌గిరి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ గ‌ణేష్‌, విశేష‌సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

 

Tags:Realization of Goddess Sri Padmavati on the Golden Chariot

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *